https://oktelugu.com/

North Korea : ఉత్తర కొరియాలో జీన్స్ ధరించరు.. ఎందుకో తెలుసా?

ఉత్తర కొరియా గురించి అందరికీ తెలిసిందే. అక్కడ కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ దేశంలో కిమ్ మాటే శాసనం. అయితే ఆ దేశంలో ఎవరైనా జీన్స్ వేసుకుంటే వాళ్లకు వెంటన కఠిన శిక్ష ఉంటుంది. ఆ శిక్షతో వాళ్లు జన్మలో మళ్లీ జీన్స్ వేసుకోరు. కేవలం శిక్ష మాత్రమే కాకుండా జరిమానా కూడా ఉంటుంది. అయితే ఉత్తర కొరియా జీన్స్ నిషేధించడానికి ఓ కారణం ఉంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 26, 2024 / 01:28 AM IST

    North Korea

    Follow us on

    North Korea : ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే ధరించే జీన్స్ ఇప్పుడు అమ్మాయిలు కూడా ధరిస్తున్నారు. రోజురోజుకీ పెరుగున్న ఫ్యాషన్ నేపథ్యంలో ఇందులో చాలా మోడల్స్ వచ్చాయి. చాలా కంఫర్ట్‌గా ఉంటాయని ఎక్కువమంది వీటినే ధరిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వీటిని ధరిస్తారు. ఫ్యాషన్ అంటే నచ్చని వాళ్లు మాత్రమే వీటిని ధరించరు. సాంప్రదాయ చుడీదర్ ధరించే వాళ్లు కూడా కుర్తీస్‌కి సెట్‌గా జీన్స్ ధరిస్తున్నారు. దేశంలో యువత అయితే ఎక్కువగా పాశ్చాత్య కల్చర్‌కి బాగా అలవాటు పడింది. ఎక్కడ చూసిన జీన్స్ వేసుకుని కనిపిస్తారు. పల్లేటూరులో తక్కువగా జీన్స్ ధరించేవాళ్లు ఉంటారు. కానీ పట్టణంలో అయితే ఇక అందరూ జీన్స వేసుకునే వాళ్లే ఉంటారు. ఎవరో ఒకరు సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. అంత పాపులర్ అయిన జీన్స్‌ను ఓ దేశంలో ధరించడం నేరం. ఒకవేళ ధరిస్తే వాళ్లకు శిక్ష తప్పదు. ఇంతకీ ఆ దేశం ఏది? ఎందుకు జీన్స్ ధరించరు? దీనికి గల కారణాలేంటి? ఈ రోజు స్టోరీలో మనం తెలుసుకుందాం.

    ఉత్తర కొరియా గురించి అందరికీ తెలిసిందే. అక్కడ కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ దేశంలో కిమ్ మాటే శాసనం. అయితే ఆ దేశంలో ఎవరైనా జీన్స్ వేసుకుంటే వాళ్లకు వెంటన కఠిన శిక్ష ఉంటుంది. ఆ శిక్షతో వాళ్లు జన్మలో మళ్లీ జీన్స్ వేసుకోరు. కేవలం శిక్ష మాత్రమే కాకుండా జరిమానా కూడా ఉంటుంది. అయితే ఉత్తర కొరియా జీన్స్ నిషేధించడానికి ఓ కారణం ఉంది. పాశ్చత్య సంస్కృతికి అలవాటు పడటం ఆ దేశానికి నచ్చదు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా.. ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. అయితే దక్షిణ కొరియా అమెరికాకు మిత్రదేశం. కానీ ఉత్తర కొరియా అమెరికాకి వ్యతిరేకం. ఇలా అమెరికాకు మిత్రదేశాలన్నీ ఉత్తర కొరియాకు వ్యతిరేకమే. అందులో భాగంగా వచ్చిందే ఇది. జీన్స్ పాశ్చాత్య సంస్కృతికి చెందినది. అంటే అమెరికాకి చెందిన ఫ్యాషన్. దీంతో పాశ్చాత్య వ్యక్తిత్వానికి తిరుగుబాటుగా జీన్స్ ధరించరు. ఒకవేళ ధరిస్తే ఉత్తర కొరియాలోని కమ్యూనిజానికి తిరుగుబాటుగా గుర్తిస్తారు.

    ఉత్తర కొరియాలో ప్రజలు ధరించే దుస్తుల నుంచి వాళ్లు చేసే ఉద్యోగాలు, ప్రతి పని కూడా ప్రభుత్వం నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుంది. దేశంలో సాంప్రదాయ కొరియన్ దుస్తులు మాత్రమే ధరించాలి. కాదని ఎవరైనా ఎదురు చెబితే వాళ్లకు రోడ్డు మీదే కఠిన శిక్షలు ఉంటాయి. ఇక్కడ కేవలం జీన్స్ మాత్రమే నిషేధం కాదు. ఇంకా ఎన్నో నిషేధాలు ఉన్నాయి. ఈ దేశంలో నీలం రంగు ఆభరణాలు ధరించకూడదు. రెడ్ లిప్‌స్టిక్ వేసుకోకూడదు. దేశమంతా ప్రభుత్వం నిర్ణయించిన హెయిర్ స్టైల్‌ను మాత్రమే చేయించుకోవాలి. నిబంధనలను అతిక్రమిస్తే వాళ్లకు కఠిన శిక్షలు తప్పవు. వీటితో పాటు జరిమానా కూడా ఉంటుంది.