Mobile On Bed : రాత్రి పడుకునే ముందు మొబైల్ ను బెడ్ మీదనే పెట్టుకుంటున్నారా?

ఎక్కువ ఫోన్ ను వాడటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవా? అనే ప్రశ్న మీలో ఎంత మందికి వచ్చింది? సందేహం ఉన్నా కూడా కొందరు అదే విధంగా ఫోన్ ను వాడుతుంటారు. ఇక చివరకు పడుకునే ముందు బెడ్ మీద కూడా ఫోన్ ను పక్కనే పెట్టుకుంటున్నారు.

Written By: Bhaskar, Updated On : August 25, 2024 3:47 pm

Mobile on Bed

Follow us on

Mobile On Bed :  మొబైల్ మొబైల్ మొబైల్.. ప్రపంచాన్ని అరచేతిలో చూపించేది ఈ మొబైల్. చిన్న పిల్లల నుంచి పండు ముసలి చేతిలో కూడా ఈ ఫోన్ ఉంటుంది. మంచి నేర్చుకునేది తక్కువ చెడుకు అలవాటు పడేది ఎక్కువ. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఫోన్లు కచ్చితంగా ఉంటున్నాయి. చాలా మంది సెల్ ఫోన్ కు బానిస అయ్యారు అనడంలో సందేహం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫుడ్ లేకున్నా మొబైల్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే అనేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.

తింటూ ఫోన్, చదువుతూ ఫోన్, మాట్లాడుతూ ఫోన్, చివరకు బాత్రూమ్ కు వెళ్లినా కూడా ఫోన్ వచ్చేస్తుంది. మరి ఇంత ఎక్కువ ఫోన్ ను వాడటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవా? అనే ప్రశ్న మీలో ఎంత మందికి వచ్చింది? సందేహం ఉన్నా కూడా కొందరు అదే విధంగా ఫోన్ ను వాడుతుంటారు. ఇక చివరకు పడుకునే ముందు బెడ్ మీద కూడా ఫోన్ ను పక్కనే పెట్టుకుంటున్నారు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇంతకీ పడుకునే ముందు ఫోన్ ను పక్కన పెట్టుకొని పడుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సెల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందట. మెలటోనిన్ అనేది నిద్రను ప్రేరేపించే ఒక హార్మోన్ అని తెలుపుతున్నారు నిపుణులు. కాబట్టి, మొబైల్ స్క్రీన్ వైపు చూడటం వల్ల నిద్ర రావడం కష్టమవుతుంది.. అంతేకాదు మంచి నిద్ర కూడా రాదట. రాత్రి మొబైల్ స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తే కళ్లు పొడిబారుతాయి అంటున్నారు నిపుణులు.. దీని వల్ల దృష్టి మందగించే అవకాశం ఉందట. అనేక రకాల కంటి సమస్యల భారిన పడతారట. దీనితో పాటు రాత్రిపూట సోషల్ మీడియా, వార్తలు, కొన్ని రకాల సాడ్ సాంగ్స్, నెగటివ్ షార్ట్ ఫిల్మ్స్ వల్ల కూడా మనసు మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఉదయం లేవగానే బాధ పడటం, డల్ గా ఉండటం, మనసంతా గందరగోళంగా ఉండటం వంటివి జరుగుతాయట.

రాత్రిపూట మొబైల్ ఫోన్ ను మీ పక్కన ఉంచడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్ హృదయ స్పందన రేటును పెంచి.. రక్తపోటును పెంచుతుంది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అందుకే నిద్రపోయే కంటే ముందే గంట ముందు మీ ఫోన్ ను తీసి పక్కన పెట్టండి. లేదంటే పడుకునే ముందు మంచి పుస్తకం చదవడం, మంచి సంగీతం వినడం చాలా మంచిది. మొబైల్ ఫోన్ వ్యసనంలా మారితే ఆత్మహత్యలను ప్రేరేపిస్తుందని మరికొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మొబైల్ ఫోన్ లైటింగ్‌తో తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. అందుకే సమస్యలను పెంచే ఈ మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండటం బెటర్. మరీ ముఖ్యంగా కనీసం రాత్రి పడుకునే ముందు అయినా సరే మీ పక్కన నుంచి దూరంగా పెట్టుకోండి.