Onions: పచ్చి ఉల్లిపాయలు అనేవి కొందరు తింటుంటారు. పూర్వం కొందరు చద్దన్నంతో ఉల్లిపాయలు తినేవారు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది బిర్యానీతో పచ్చి ఉల్లిపాయలను (Onions) తింటున్నారు. అయితే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని కొందరు అంటుంటారు. ఎందుకంటే ఉల్లిపాయ (Onions) తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయల్లోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని (Health Benefits) మెరుగుపరచడంతో పాటు అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కొందరు కేవలం బిర్యానీ (Biryani), మసాలా కూరలకు మాత్రమే ఉల్లిపాయలను వాడుతుంటారు. అయితే డైలీ ఒక పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని క్వెర్సెటిన్ అనే పాలీఫెనాల్ అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు
ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అలెర్జీలను తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. ఎరుపు ఉల్లిపాయల్లో కంటే పసుపు ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో 11 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంతో పాటు ఫ్రీ-రాడికల్‌ను కూడా తగ్గిస్తాయి. వీటివల్ల అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
క్యాన్సర్ సమస్యల నుంచి విముక్తి
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల క్యాన్సర్ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిలోని సేర్విన్గ్స్ ఆర్గానోసల్ఫర్, ఫ్లేవానాల్స్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
తక్కువ కొలెస్ట్రాల్
ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఇవి ధమనులలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు. దీంతో ఊబకాయం వంటి సమస్యల బారిన పడరు. బరువు ఎక్కువగా పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి పచ్చి ఉల్లిపాయలను తినండి. పూర్వం రోజుల్లో పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినేవారు. అందుకే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఫిట్‌గా ఉండేవారు.
కళ్లు ఆరోగ్యం
పచ్చి ఉల్లిపాయల వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లిపాయలు క్వెర్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలతో నిండి ఉంటాయి. ఇవి కళ్లను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు డైలీ వీటిని తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.