Living: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది తక్కువ కాలమే జీవిస్తున్నారు. నిజానికి ఈ రోజుల్లో ఒక 50 ఏళ్లు జీవించడం (Living) కూడా కష్టమే. ఎందుకంటే మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల (Food Habits) వల్ల చాలా మంది తక్కువ ఏళ్లు మాత్రమే జీవిస్తున్నారు. ఒక 30 ఏళ్లు వచ్చే సరికి అనారోగ్య సమస్యలతో (Health Issues) బాధపడుతున్నారు. ఈ రోజుల్లో ఒకవేళ జీవించినా కూడా కొన్నేళ్లు మాత్రమే జీవిస్తున్నారు. అది కూడా అనారోగ్య సమస్యలతోనే (Health Issues) ఏదో బతుకుతున్నారు. అయితే పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. పురుషుల (Mens) సగటు ఆయుర్దాయం 68.4 సంవత్సరాలు ఉండగా.. మహిళలకు (womens) 73.8 సంవత్సరాలు ఉన్నట్లు తేలింది. అసలు పురుషులకు, స్త్రీలకు మధ్య ఇన్ని ఏళ్లు వ్యత్యాసం ఎందుకు? స్త్రీలు ఎక్కువ ఏళ్లు జీవించడానికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్త్రీలతో పోలిస్తే పురుషులు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్‌లు చేస్తుంటారు. ఉదాహరణకు ఎక్కువ స్పీడ్‌గా బైక్ నడపడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవించడానికి ఇది కూడా ఓ కారణమే అని నిపుణులు చెబుతున్నారు. అలాగే పురుషుల్లో విడుదలయ్యే.. టెస్టోస్టెరాన్ శరీరంలోని కొలెస్ట్రాల్‌తో కలిసి పనిచేస్తుంది. దీంతో ఎక్కువగా కొలెస్ట్రాల్ విడుదల కావడం వల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పురుషులు తొందరగా మరణిస్తున్నారు. అయితే స్త్రీలు ప్రీ-మెనోపాజ్ వల్ల ఎక్కువ కాలం జీవిస్తారు. పెళ్లయిన తర్వాత మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ విడుదల అవుతుంది. దీనివల్ల వారు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఈస్ట్రోజెన్‌కు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తనాళాల లోపలి భాగంలో తెల్ల రక్తకణాలు అంటుకోవడాన్ని ఆపుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.
పురుషులలో కేవలం ఒక X-క్రోమోజోమ్‌లు ఉంటే.. స్త్రీలలో రెండు X-క్రోమోజోములు ఉంటాయి. ఇవి మహిళలను రక్షిస్తాయి. పురుషులు ఎక్కువగా ధూమపానం, మద్యపానం వంటివి సేవిస్తారు. వీటిని సేవించిన వారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటివల్ల క్యాన్సర్, కాలేయం వంటి సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే స్త్రీలు ఎక్కువగా పని చేస్తారు. ఇంట్లో పనులు చేయడం వల్ల శారీరక శ్రమ పెరుగుతోంది. అదే పురుషులు అయితే పెద్దగా శారీరక వ్యాయామం చేయరు. దీనివల్ల కూడా స్త్రీలు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.