Night Duty Health Warning: కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించి.. రాత్రి సమయంలో నిద్రపోతూ ఉంటారు. కానీ సాఫ్ట్వేర్ ఇతర రంగాలకు చెందిన వారు నైట్ షిఫ్ట్ జాబ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటివారు ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలాక్స్ గా ఉండి.. రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఉదయం కంటే రాత్రిళ్ళు పనిచేసేవారు ఆహారం తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం చేసేవారు ఎటువంటి ఆహారం తీసుకున్నా వాతావరణంలో ఉండే మార్పులతో తొందరగా జీర్ణమి అవకాశం ఉంటుంది. కానీ రాత్రి సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మితంగా.. తొందరగా డైజెషన్ అయ్యే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అయితే అలా కాకుండా ప్రాసెస్ వంటివి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
చాలామంది రాత్రి సమయంలో విధులు నిర్వహించేవారు నిద్ర, ఆకలి నుంచి తట్టుకునేందుకు రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. కొందరు చిప్స్, ఇతర మసాలా ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అజీర్ణ సమస్యలు పెరిగిపోతాయి. మసాలా ఫుడ్స్ ఆహార పదార్థాలలో కొవ్వు ఎక్కువగా ఉండడంతో వీటిని తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనేక సమస్యలు వస్తాయి. రాత్రి సమయాల్లో విధులు నిర్వహిస్తు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బిపి, షుగర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ తో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇంకొంతమంది రాత్రి సమయంలో చిప్స్ వంటి మసాలా ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి తిన్న తర్వాత వెంటనే డైజేషన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో పల్సర్ వంటి సమస్యలు వస్తాయి. యాసిడ్ రీప్లేక్స్ సమస్య ఎక్కువగా ఉండడంతో గుండెల్లో మంట ఏర్పడుతుంది. ఇది క్రమంగా గ్యాస్టిక్ సమస్యలను తీసుకువస్తుంది. అలాగే రాత్రి సమయంలో ప్రాసెస్ చేసిన ఫ్రూట్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆందోళన వాతావరణం ఉంటుంది.
అయితే రాత్రి సమయంలో విధులు నిర్వహించేవారు ఎక్కువగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో పండ్లు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఉడికించిన కూరగాయలు, ఓట్స్, బ్రౌన్ రైస్, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నిద్ర గడియారాన్ని సెట్ చేసుకొని తగినంత నిద్రపోతూ ఉండాలి. ఎక్కువగా కూర్చుని పనిచేసే వారు ప్రతిరోజు తప్పనిసరిగా వాకింగ్ చేస్తూ ఉండాలి. మానసిక ఉల్లాసం కోసం ధ్యానం చేస్తూ ఉండాలి.