Redmi A4 5G: మొబైల్ అవసరం తప్పనిసరిగా మారడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉంటున్నారు. అయితే ఈ ఫోన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో వాటి ప్లేస్ లో కొత్తవి కొనాల్సి వస్తుంది. కొత్త ఫోన్ అనుభవాలు చేసే క్రమంలో బడ్జెట్లో ఫోన్ తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇలాంటి వారి కోసం Redmi కంపెనీ చౌకైన ఫోన్లను అందిస్తూ ఉంటుంది. తాజాగా అప్డేట్ చేసిన మొబైల్స్ ను తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది. ఈ ఫోన్లో అద్భుతమైన కెమెరాతోపాటు.. నెట్వర్క్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండడంతో దీనిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉందంటే?
Redmi కంపెనీ నుంచి లేటెస్ట్ గా A4 5G మొబైల్ ను ఇటీవల న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. దీనిని తక్కువ ధరకు అందించేలా ప్లాన్ చేశారు. ఇందులో డిస్ప్లే స్పెషల్ అని చెప్పవచ్చు. 6.5 2 అంగుళాల HD+ డిస్ప్లే తోపాటు 90 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో సాధారణ నుంచి క్వాలిటీ వీడియోలు చూడడానికి ఈ డిస్ప్లే అనుకూలంగా ఉంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్ ను ఉంచడంతో మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ మొబైల్లో డ్యూయల్ కెమెరా సెటప్ ను అమర్చారు. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా ఉండగా..8 MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు AI ఆధారిత ఫోటోలను అందిస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి.. లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన స్నాప్స్ కావాలని అనుకునే వారికి ఇది అవసరమైన మద్దతును అందిస్తుంది.
రెడ్ మీ A4 ఫోన్లో బలమైన బ్యాటరీని అమర్చారు. ఇందులో 5000 mAh.. ఇది 18 W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు రోజంతా వాడినా కూడా చార్జింగ్ తక్కువగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి చార్జింగ్ చేస్తే రోజంతా చార్జింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు మొబైల్ యూజ్ చేసే వారికి ఈ ఫోన్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. ఇందులో 4gb రామ్ ఉండగా 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే విధంగా సెట్ చేశారు. అలాగే వైఫై, బ్లూటూత్ 5.1, USB type C వంటి ఫీచర్లతో అలరిస్తుంది. దీని ధర వివరాలు పూర్తిగా వెల్లడించినప్పటికీ.. రూ.10,000 లోపే ఉండే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. తక్కువ ధరలో అప్డేట్ అయినా మొబైల్ కొనాలని అనుకునే వారికి ఈ ఫోన్ వర్క్ అవుట్ అవుతుందని కొంతమంది నిపుణులు అంటున్నారు.