
మన దేశంలో చాలామందిని తిమ్మిర్ల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొంతమందికి తరచుగా తిమ్మిర్లు వస్తుంటాయి. తరచుగా తిమ్మిర్లు వస్తే నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం కాళ్లు, చేతులను కదపని పక్షంలో తిమ్మిర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తరచూ వచ్చే తిమ్మిర్లపై దృష్టి పెట్టని పక్షంలో అనేక ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
శరీరానికి సరైన స్థాయిలో విటమిన్స్ అందకపోతే తిమ్మిర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన విటమిన్లలో బీ12 విటమిన్ కూడా ఒకటి కాగా ప్రతిరోజూ శరీరానికి ఈ విటమిన్ అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బీ12 విటమిన్ లోపం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, మెటబాలిజం పెరగాలన్నా బీ12 ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.
బీ12 విటమిన్ సమృద్ధిగా ఉండటం వల్ల నరాలు బలంగా తయారయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. డిప్రెషన్, స్కిన్ సమస్యలు, గుండె జబ్బులకు బీ12 లోపమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. విటమిన్ బీ12 లోపం వల్ల దేశంలో చాలామంది ప్రజలు అనేక వ్యాధులతో బాధ పడుతున్నారు. పాలు, చీజ్ వంటి పాల పదార్థాలలో కూడా శరీరానికి అవసరమైన బీ12 లభిస్తుంది. బీ12 లోపం వల్ల రక్తహీనత సమస్య కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
బీ12 విటమిన్ లోపంతో బాధ పడేవాళ్లు ఆ విటమిన్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. బీ12 విటమిన్ ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.