https://oktelugu.com/

ఎస్బీఐ సూపర్ స్కీమ్.. డబ్బులు పెడితే అదిరిపోయే రాబడి..!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాపై ఎక్కువగా వడ్డీరేటును పొందలేమనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ కొన్ని స్పెషల్ స్కీమ్స్ ను కూడా అమలు చేస్తుండటం గమనార్హం. కరోనా వల్ల ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్బీఐ కొత్త స్కీమ్ ను అమలు చేస్తుంది. ఎస్బీఐ అమలు చేస్తున్న ఈ స్కీమ్ లో చేరడం వల్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 21, 2021 / 11:59 AM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాపై ఎక్కువగా వడ్డీరేటును పొందలేమనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ కొన్ని స్పెషల్ స్కీమ్స్ ను కూడా అమలు చేస్తుండటం గమనార్హం. కరోనా వల్ల ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్బీఐ కొత్త స్కీమ్ ను అమలు చేస్తుంది.

    ఎస్బీఐ అమలు చేస్తున్న ఈ స్కీమ్ లో చేరడం వల్ల ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను సీనియర్ సిటిజన్స్ మాత్రమే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ కాగా ఎస్బీఐ ఉదయ్ కేర్ డిపాజిట్ పేరుతో ఈ స్పెషల్ స్కీమ్ అమలవుతోంది. ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఈ స్కీమ్ లో డబ్బులు డిపాజిట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి.

    ఈ స్కీమ్ లో చేరడం ద్వారా సాధారణ కస్టమర్లు పొందే వడ్డీరేటు కంటే ఎక్కువ వడ్డీరేటును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా సీనియర్ సిటిజన్స్ కు ప్రస్తుతం ఎస్బీఐ అందిస్తున్న 50 బేసిక్ పాయింట్లకు అదనంగా 30 బేసిక్ పాయింట్ల వడ్డీ లభిస్తుందని తెలుస్తోంది. 6.2 శాతం వడ్డీని ఈ స్కీమ్ లో చేరడం ద్వారా సీనియర్ సిటిజన్లు పొందవచ్చు.

    60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కొన్నిరోజులు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి సీనియర్ సిటిజన్లు వెంటనే ఈ స్కీమ్ లో చేరితే మంచిదని చెప్పవచ్చు.