https://oktelugu.com/

మరోసారి తీవ్రంగా గాయపడిన విశాల్

నటుడు విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది. విశాల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం నాట్ ఏ కామన్ మ్యాన్ శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ జరుగుతోంది. ఇందులో విశాల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. దీంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. […]

Written By: , Updated On : July 21, 2021 / 12:10 PM IST
Follow us on

నటుడు విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది. విశాల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం నాట్ ఏ కామన్ మ్యాన్ శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ జరుగుతోంది. ఇందులో విశాల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. దీంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ వెల్లడించింది.