https://oktelugu.com/

Research: పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయట.. కొన్ని పదాలు గుర్తిస్తాయట!

పుట్టగొడుగులు.. వీటినే ‘మష్రూమ్స్’ అని పాష్ గా అంటారు. ఎక్కువమంది ఆరోగ్యం కోసం వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. తాజాగా వీటిపై జరిగిన ఓ పరిశోధన పుట్టగొడుగుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయని.. దాదాపు 50 పదాలను ఇవి గుర్తిస్తాయని ఈ పరిశోధన తెలుపుతోంది. ఇంగ్లండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఇంగ్లండ్ ప్రొఫెసర్ ఆండ్రూ అడమట్జ్కీ వీటిపై […]

Written By:
  • NARESH
  • , Updated On : April 9, 2022 / 10:27 PM IST
    Follow us on

    పుట్టగొడుగులు.. వీటినే ‘మష్రూమ్స్’ అని పాష్ గా అంటారు. ఎక్కువమంది ఆరోగ్యం కోసం వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. తాజాగా వీటిపై జరిగిన ఓ పరిశోధన పుట్టగొడుగుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

    పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయని.. దాదాపు 50 పదాలను ఇవి గుర్తిస్తాయని ఈ పరిశోధన తెలుపుతోంది. ఇంగ్లండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఇంగ్లండ్ ప్రొఫెసర్ ఆండ్రూ అడమట్జ్కీ వీటిపై పరిశోధించి మరీ ఈ నిజాన్ని నిగ్గు తేల్చారు.

    నాలుగు రకాల శిలీంద్రాల ఎలక్ట్రికల్ యాక్టివిటీపై ఈ పరిశోధన చేశారు. ఇందులో శిలీంధ్రాల ఎలక్టికల్ యాక్టివిటీ ఎలా పనిచేస్తాయి? వాటి నిర్మాణం ఎలా ఉంటుందని ఆయన పరిశోధించారు. అయితే శిలీంధ్ర ప్రేరణలు కూడా మానవ ప్రసంగాన్ని పోలిన నిర్మాణంలో ఉంటాయని శాస్త్రవేత్త ఆండ్రూ ఆడమట్జ్కీ కనుగొన్నారు.

    అంతేకాకుండా వాటి నిర్మాణం కొన్ని డజన్ల పదాల విద్యుత్ కార్యకలాపాల మాదిరిగానే ఉంటాయని ఆయన తెలిపాడు. అయితే పుట్టగొడుగులు కూడా మావుల మాదిరిగానే ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని.. మానవ భాషలోని దాదాపు 50 పదాలను అవి గుర్తించగలవని ఆయన పరిశోధనలో వెల్లడించారు.