Viral Photos: హిమాలయాల్లోని అద్భుతులు.. పంచుకున్న మన సైనికులు

Viral Photos: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP).. హిమాలయాల్లోని చైనా సరిహద్దుల్లో పహారా కాసే వీళ్ల సాహసాలు అబ్బురపరుస్తుంటాయి. భూమికి 15వేల అడుగులు ఎత్తులో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో వారు ఎముకలు కొరికే చలిలో దేశం కోసం వారు పహారా కాస్తూ మనల్ని అందరినీ రక్షిస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా శత్రువులతోనే కాదు.. ఉగ్రవాదుల రాకను ప్రతికూల వాతావరణంలోనూ వాళ్లు ధైర్యంగా నిలబడి దేశ రక్షణలో కీలక శక్తిగా ఉన్నారు. ఐటీబీపీ సోషల్ మీడియాలో షేర్ చేసే […]

Written By: NARESH, Updated On : April 9, 2022 8:03 pm
Follow us on

Viral Photos: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP).. హిమాలయాల్లోని చైనా సరిహద్దుల్లో పహారా కాసే వీళ్ల సాహసాలు అబ్బురపరుస్తుంటాయి. భూమికి 15వేల అడుగులు ఎత్తులో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో వారు ఎముకలు కొరికే చలిలో దేశం కోసం వారు పహారా కాస్తూ మనల్ని అందరినీ రక్షిస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా శత్రువులతోనే కాదు.. ఉగ్రవాదుల రాకను ప్రతికూల వాతావరణంలోనూ వాళ్లు ధైర్యంగా నిలబడి దేశ రక్షణలో కీలక శక్తిగా ఉన్నారు.

ఐటీబీపీ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్‌లు వారి ధైర్యసహసాలను ప్రతిబింబించేలా ఉంటాయి. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తరుచుగా వాళ్లు ఫొటోలు పంచుకుంటారు.ఆ ఫొటోలతో మన దేశాన్ని రక్షించే పర్వత ప్రాంతాలలో వీరి జీవితాలు ఎంత దుర్భరంగా సాగుతాయో దేశ ప్రజలకు తెలుస్తోంది. మైనస్ ఉష్ణోగ్రతలలో వారు ఎలా శిక్షణ పొందుతారో చూపించే వీడియోలు, వారు ప్రత్యేక రోజులను ఎలా జరుపుకుంటారు అనే ఫొటోలు ఐటీబీపీ అధికారిక ప్రొఫైల్‌లలో పోస్ట్‌లు చేస్తుంటారు.

తాజాగా ఎండాకాలం కావడం.. హిమాలయాల్లోని మంచు కరగడంతో కొండలు బయటపడ్డాయి. హిమాలయాల్లో జీవులు, ప్రకృతి, మొక్కల అందాలను ఐటీబీపీ పోలీసులు పంచుకున్నారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి. జవాన్లు బంధించిన ఈ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అవి వైరల్ అయ్యాయి.

హిమవీర్స్ తీసిన చిత్రాలు” .. “హిమాలయాల్లో జీవితం,” అనే క్యాప్షన్ తో రెండు రోజుల క్రితం షేర్ చేసిన పోస్ట్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక చిన్న ఎలుగుబంటి లాంటి జీవిని ఫొటోలు తీశారు. ఆ జీవి ఏంటదన్నది హాట్ టాపిక్ గా మారింది. హిమాలయాల్లో జీవించే ఈ జంతువు ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక హిమాలయాల్లోని రాళ్ల సంధుల్లో మొలిచిన అరుదైన పూల మొక్కలను ఐటీబీపీ పోలీసులు పంచుకున్నారు. పర్వతాల రాతి భూభాగాల మధ్య వికసించే పువ్వులు చాలా అరుదైన పుష్పాలగా కనిపిస్తున్నాయి. వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. “హిమాలయాల అద్భుతాలు” అంటూ కామెంట్ చేస్తున్నారు.