Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే. . యంగ్ బ్యూటీ ‘ఎస్తర్ అనిల్’ తన కళాశాల విద్య శుక్రవారంతో పూర్తయినట్టు తెలిపింది. ‘ఈ రోజు చివరి పరీక్ష రాశాను అంటూ తన ఫొటోను కూడా షేర్ చేసింది. మరి, ఎలాగూ పరీక్ష అయిపోయింది కాబట్టి.. ఇక రేపటి నుంచి రచ్చ చేస్తాను అన్నట్టు అమ్మడు వాలకం ఉంది.

సీనియర్ బ్యూటీ శిల్పాశెట్టి కాసేపు మోటివేషనల్ స్పీకర్ గా మారిపోయింది. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే సాధ్యం కానిదేదీ ఉండదంటోంది శిల్పా.
టాల్ బ్యూటీ ‘రకుల్ ప్రీత్ సింగ్’ ‘పనస’ తొనల రుచిని ఆస్వాదిస్తూ.. సోషల్ మీడియాలో నెటిజన్లకు కూడా పనస రుచి చూపించింది. పైగా పనస లోని గొప్పతనాల గురించి కూడా ‘రకుల్ ప్రీత్ సింగ్’ వివరంగా వివరించింది. పనసలో ఎన్నో పోషకాలుంటాయి. మీరూ తినేందుకు ప్రయత్నించండి’ అని ‘రకుల్ ప్రీత్ సింగ్’ చెప్పింది.
క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చీరలో ఉన్న తన ఫొటోల్ని పోస్ట్ చేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అన్నట్టు అనుపమ పరమేశ్వరన్ లో మంచి కవయిత్రి కూడా ఉంది. అప్పుడప్పుడు ఆమె కొన్ని కవితలు కూడా రాస్తూ ఉంటుంది.
Also Read: Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ లో పాయింట్స్ ఇవే
వయసు పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గడం లేదు అన్నట్టు ఫోజులు పెట్టి ఫోటోలు దిగి మరీ.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది సీనియర్ బ్యూటీ విద్యాబాలన్.
అందాల అందాల తార అమలాపాల్ గుర్తు ఉంది కదా. ఈ మధ్య ఛాన్స్ ల కోసం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది లేండి. ఈ క్రమంలో తెగ పోస్ట్ లు పెడుతుంది. తాజాగా కొండ లోయ ప్రాంతాల్లోకి వెళ్లి తనలో తానే నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం