Homeఆంధ్రప్రదేశ్‌Prashna Ravan: ప్రశ్న రావణ్ "గమన" అరెస్ట్.. రహస్యంగా విచారణ.. ఏపీ పోలీసుల తదుపరి స్టెప్...

Prashna Ravan: ప్రశ్న రావణ్ “గమన” అరెస్ట్.. రహస్యంగా విచారణ.. ఏపీ పోలీసుల తదుపరి స్టెప్ అదే

Prashna Ravan: ఏపీ పోలీసుల చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. వాళ్లు వేస్తున్న స్టెప్పులకు పిచ్చికూతలు కూసిన వారంతా సైలెంట్ అయిపోతున్నారు. యూట్యూబ్ ఉందని.. సోషల్ మీడియా ఉందని లేకి వ్యాఖ్యలు చేసిన వారంతా శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు మరొక మహిళ కూడా చేరింది.

ఇటీవల ప్రశ్న రావణ్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపా చట్టం కింద అతని మీద కేసులు నమోదు చేశారు. అతడు ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు. అతడికి సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోన్లో ఉన్న బూతు వీడియోలు.. అమ్మాయిలను వేధించిన దృశ్యాలు.. కీలకమైన సమాచారం.. బ్యాంకు లావాదేవీలు.. ఇలా అత్యంత కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అతని ఫోన్ మొత్తం రిట్రైవ్ చేస్తున్నారు.

ప్రశ్న రావణ్ బృందంలో గమన అత్యంత కీలకమైన వ్యక్తి. ఈమె వైసీపీకి చెందిన ఓ నాయకుడి సోదరుడి ప్లాట్ లో ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఫండింగ్ మొత్తం ఈమె చూసుకుంటున్నారు. ప్రశ్న రావణ్ తో కలిసి అనేక వివాదాస్పద వీడియోలను ఈమె రూపొందించారు. అతనితో అత్యంత సన్నిహితంగా ఉండేవారని టాక్

రావణ్ అరెస్ట్ అయిన తర్వాత.. వైసీపీ అధినేత జగన్ తమకు అనుకూలంగా ఉన్నారని .. ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని గమన ఒక సెల్ఫీ వీడియోలో ప్రకటించారు. ఇటీవల జగన్ గన్నవరం విమానాశ్రయంలో ఉన్నప్పుడు గమన ఆయనను కలిశారు. అండగా ఉంటారని మాట ఇచ్చారు. కాగా సోమవారం గన్నవరం పోలీసులు గమనను తీసుకొచ్చారు. ఆమెను డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత.. అత్యంత రహస్య ప్రదేశంలో విచారించారు. ఆమె వాంగ్మూలాలు సేకరించారు. అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కాగా రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ను హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్నాడు. వైసిపి కి సంబంధించిన నాయకుడి సోదరుడు ప్లాట్ నుంచి ఈ వ్యవహారం సాగిస్తున్నాడు.

ప్రశ్న రావణ్.. గమన కలిసి చాలా చేశారని.. ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహాన్ని కలిగించేందుకు కుట్రలు చేశారని పోలీసులు అభియోగాలు మోపారు. వీరి బ్యాంకు ఖాతాలు.. ఇతర వ్యవహారాలను కూడా పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలను పోలీసుల సేకరించి బయటపెట్టారని తెలుస్తోంది. గమన ఏం చెప్పారు.. పోలీసులు ఏం వాంగ్మూలాలు సేకరించారు.. తదుపరి జరిగే చర్యలు ఏంటి అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version