Balakrishna Daughter Tejaswini: నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ప్రముఖ రాజకీయ నాయకులూ , వైజాగ్ ఎంపీ భారత్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు , ఈమె వ్యాపార రంగం లో కూడా దిగ్గజం లాగా రాణిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. తన తండ్రి బాలయ్య కెరీర్ ని కూడా ప్రస్తుతం ఆమెనే దగ్గరుండి మానిటర్ చేస్తోంది. ‘అఖండ’ కి ముందు బాలయ్య కెరీర్ ఎలా ఉండేదో , ‘అఖండ’ తర్వాత ఎలా తయారైందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సీనియర్ హీరోల్లో మినిమం గ్యారంటీ సినిమాలను ప్రేక్షకులకు అందించే ఏకైక హీరో అనే బ్రాండ్ ఇమేజ్ కూడా బాలయ్య కి సొంతమైంది. అలాంటి ఇమేజ్ రావడానికి గల ప్రధాన కారణం తేజస్విని. బాలయ్య కి సంబంధించిన ప్రతీ సినిమా స్టోరీ ని ఈమె ఫైనల్ చేసిన తర్వాతే బాలయ్య వద్దకు వెళ్తుంది.
అందుకే బాలయ్య ఎన్నడూ లేని విరంగా క్రేజీ కాంబినేషన్స్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈమధ్య కాలం లో ‘అఖండ 2’ ఒక్కటే గురి తప్పింది కానీ , వెంటనే ఆ తర్వాత క్రేజీ లైనప్ ని సెట్ చేసింది తేజస్విని. గోపీచంద్ మలినేని, కొరటాల శివ, వివేక్ ఆత్రేయ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో బాలయ్య లైనప్ నిండిపోయేలా చేసింది తేజస్విని. ఇవన్నీ పక్కన పెడితే , రీసెంట్ గా ఈమె నుండి విడుదలైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా తేజస్విని లో దాగున్న ee టాలెంట్ ని చూసి నోరెళ్లబెట్టారు. ‘లవ్ స్టోరీ’ మూవీ లో చార్ట్ బస్టర్ గా నిల్చిన ‘సారంగా ధనియా’ పాటకు తేజస్విని వేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.
ఈ పాటలో ఆమె వేసిన డ్యాన్స్ సాయి పల్లవి ని మించి ఉంది , ఇంత అద్భుతంగా డ్యాన్స్ వేస్తుందని మేము అసలు ఊహించలేదు , ఇంత టాలెంట్ ని పెట్టుకొని సినిమాల్లోకి ఎందుకు రాలేదు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తోంది , డ్యాన్స్ బాగా వేస్తోంది , ఇక నటన అనేది నందమూరి వంశం రక్తం లోనే ఉంది , కాబట్టి ఇప్పటికీ సమయం ఏమి మించిపోలేదు , తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
