Profitable Break Up : మనిషికి వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందట. అది ఎవరిలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ మొత్తానికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వెర్రి ఉండటం కామనే. ఇది కొందరిలో కనిపిస్తుంది. మరికొందరిలో కనిపించదు. కొన్ని విషయాలు మనకు విస్తు గొలుపుతాయి. వింతలా కనిపిస్తాయి. అవే అవతలి వారికి బాగుందనిపిస్తుంది. ఇలా వెర్రి వేషాలు వేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అన్నారు. ఇలా మనిషి వేసే వేషాలు కొందరికి ఆసక్తికరంగాను మరికొందరికి పిచ్చి పనులుగాను తోచడంలో తప్పు లేదు. ఎందుకంటే అది వారి ఆలోచనను బట్టి ఉంటుందని మనం తెలుసుకోవాలి.
ఈ నేపథ్యంలో మనకు ఓ విషయం గురించి తెలుసుకోవాలి. ఓ ప్రేమికుల జంట కొత్త విషయం కనుగొన్నారు. అదేంటంటే హార్ట్ బ్రేకప్ ఇన్సూరెన్స్ ఫండ్ పేరిట ఓ ఐడియా వేసుకున్నారు. దీని ప్రకారం ఎవరు బ్రేకప్ చెప్పినా వారు రూ. 25 వేలు ఇవ్వాలనే ఒప్పందం పెట్టుకున్నారు. ప్రతి నెల చెరో రూ. 500 లు డిపాజిట్ చేసుకుంటున్నారు. ప్రేమకు ఎవరు బ్రేకప్ చెప్పినా అవతలి వ్యక్తి ఆ డబ్బు తీసుకోవచ్చు. దీంతో ఈ ఐడియా బాగుందని ఇద్దరు అందులో డబ్బులు జమ చేశారు.
ఇలా ఆర్యన్ తన ప్రేమికురాలితో వేసుకున్న పథకంలో డబ్బులు వేసుకోవడం అలాగే సాగింది. చివరకు ఏమైందో ఏమో కానీ ఆర్యన్ లవర్ బ్రేకప్ చెప్పేసింది. దీంతో అతడికి రూ. 25 వేలు దక్కాయి. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. ఇదేదో బాగుందని అందరు కామెంట్లు పెడుతున్నారు. వారి ఆలోచనపై ప్రశంసలు వస్తున్నాయి. ప్రేమ ఒప్పందం బాగుందని నెట్టింట్లో ప్రస్తుతం ఈ అంశం హల్ చల్ చేస్తోంది.
ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడికి రూ. పాతిక వేలు దక్కడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. సోషల్ మీడియాలో ఐడియా బాగుందనే కామెంట్లు పెరుగుతున్నాయి. మొత్తానికి ప్రేమను కూడా డబ్బుతో ముడిపెట్టారు. లోకంలో డబ్బుకు లోకం దాసోహం అనే నానుడిని నిజం చేస్తున్నారు. అందుకే మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుందని చెప్పడంలో ఉన్న వాస్తవం ఇదే. ఈ ప్రేమికుల వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతోంది. వీరి ఆలోచనకు శతకోటి దండాలు అనే వాదనలు కూడా వస్తున్నాయి.
I got Rs 25000 because my girlfriend cheated on me .When Our relationship started we deposited a monthly Rs 500 each into a joint account during relationship and made a policy that whoever gets cheated on ,will walk away with all money.
That is Heartbreak Insurance Fund ( HIF ).— Prateekaaryan (@Prateek_Aaryan) March 15, 2023
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Man gets rs 25000 in heartbreak insurance fund after his girlfriend cheated on him many on twitter want to avail policy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com