Lipstick Side Effects: అమ్మాయిలు పెదవులు అందంగా కనిపించడానికి లిప్‌స్టిక్ వాడతారు. దీంతో పెదాలు అందంగా కనిపించడంతోపాటు ముఖ సౌందర్యం కూడా పెరుగుతోంది. దీంతో లిప్‌స్టిక్ వ్యాపారం కూడా వేగంగా విస్తరిస్తోంది. మర్కెట్‌లో పది రూపాయల నుంచి రూ.500 వరకు విలువైన లిప్ స్టిక్స్ అందుబాటున్నాయి. ఇక దేశంలో ఏటా ఈ లిప్‌స్టిక్స్ వ్యాపారమే వందల కోట్లలో జరుగుతోంది. అయితే ఈ లిప్‌స్టిక్ అందాన్ని ఎంత పెంచుతుందో అనారోగ్యాన్ని కూడా అంతే తెసుదని అంటున్నారు నిపుణులు. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ఏం జరుగుతుందంటే..
లిప్‌స్టిక్ వాడే అమ్మాయిలు చాలా వరకు లిప్‌స్టిక్‌ను తింటుంటారు. పెదాలకు పెట్టుకునే సమయంలో టేస్టీగా అనిపిస్తుంది. దీంతో కొద్ది కొద్గి కొరుకుతుంటారు. అయితే ఇలా తినడం వలన కడుపులో గడ్డలు తయారవుతాయట. కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
తయారీలో రసాయనాలు..
లిప్‌స్టిక్ తయారీలో కాడ్మియం, అల్యూమినియం ఎక్కువగా వాడతారు. రంగుల కోసం కూడా కెమికల్స్ కలుపుతారు. మన కడుపులో విడుదలయ్యే ఆమ్లాలు, జ్యూస్‌లతో ఇవి కిలిసినప్పుడు చర్య జరిగి టాక్సిక్‌గా మారతాయట. లిప్‌స్టిక్‌లో వాడే లెడ్ కారణంగా నరాలు, నాడి వ్యవస్థ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందట. లిప్‌స్టిక్‌లో ఉండే పెట్రో కెమికల్స్ కారణంగా బాడీలో ఉండే హార్మోన్స్ విడుదల చేసే ఎండోక్రైం సిస్టం కూడా దెబ్బతినే అవకావం ఉంటుందట.
అతిగా వాడంక మంచిది కాదు..
అందుకే లిప్‌స్టిక్‌ను ఎంత పరిమితంగా వాడితే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా వాడినా దానిని కడుపులోకి వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంటున్నారు. ఇక తప్పనిసరి ప్రతీరోజు లిప్‌స్టిక్స్ వాడాల్సి వస్తే ఆథరైజ్‌డ్, హై క్వాలిటీ లిప్‌స్టిక్స్ ఉపయోగించాలని తెలియజేస్తున్నారు. నాసిరకమైనవాటికి దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.