Sticker On Fruits: ఫ్రూట్స్ పై అంటించి ఉన్న స్టిక్కర్స్ దేనికో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఫ్రూట్స్ కు అంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఐదు నంబర్లు ఉండి అది 9 తో ప్రారంభం అయితే ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్ లో పండించారని, వందకు వంద శాతం నాచురల్ అని అర్థం.

Written By: Swathi Chilukuri, Updated On : January 24, 2024 5:25 pm
Follow us on

Sticker On Fruits: సాధారణంగా ఆరోగ్య పరిరక్షణ కోసం పండ్లను తింటుంటాం. అరటి, ఆపిల్, దానిమ్మ ఇలా మనకు ఇష్టమైన పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని ఆరగిస్తుంటాం. అయితే మార్కెట్స్ నుంచి తెచ్చిన ఫ్రూట్స్ పై కొన్ని స్టిక్కర్లు అతికించి ఉంటాయి. కానీ వాటిని ఎందుకు అతికించారు? వాటి అర్థం ఏంటనేది మాత్రం అంతగా పట్టించుకోరు. అయితే ఫ్రూట్స్ పై అంటించిన స్టిక్కర్స్ కు మినింగ్ ఉంది. అదేంటి? అసలు అలా ఎందుకు స్టిక్కర్స్ పెడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ సీజన్ అయినా సరే పండ్ల మార్కెట్లు ఎప్పుడూ రకరకాల ఫ్రూట్స్ తో నిండిపోయి ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ పై స్టిక్కర్లు కనిపిస్తూనే ఉంటాయి. అలా స్టిక్కర్లు అంటించి ఉంటే పండ్ల నాణ్యత బావుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ప్రదేశాల నుంచి వచ్చే పండ్లకు కూడా ఆ విధంగా స్టిక్కర్స్ అంటిస్తారని భావిస్తుంటారు.

అయితే ఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ స్టిక్కర్ల వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం పండ్లు, కూరగాయాలపై ఇటువంటి స్టిక్కర్లను అతికిస్తారు. నాణ్యత, ధరతో పాటు పండ్లను ఏ విధంగా పండించారనే సమాచారాన్ని ఈ స్టిక్కర్లు సూచిస్తాయి.

ఫ్రూట్స్ కు అంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఐదు నంబర్లు ఉండి అది 9 తో ప్రారంభం అయితే ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్ లో పండించారని, వందకు వంద శాతం నాచురల్ అని అర్థం. అదే కోడ్ ఐదు నంబర్లు ఉండి 8తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్, సగం కెమికల్స్ వినియోగించినట్లని తెలుస్తోంది. ఒకవేళ నాలుగు నంబర్లు అది నాలుగుతో స్టార్ట్ అయితే అది పూర్తిగా కెమికల్స్ తో పండించారని, ఇన్ ఆర్గానిక్ అని భావించవచ్చు. అలాగే స్టిక్కర్లపై ఎటువంటి నంబర్లు లేకపోతే మార్కెట్ లో అమ్మకం దారులు మోసం చేస్తున్నారని అర్థం. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయండి.