Life Style: మనుషులకు అన్యోన్య జీవితం అత్యంతావశ్యకం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేవారే. అయితే కొందరు వివాహం అయిన తరువాత జీవిత భాగస్వామితో పడక గదిని పంచుకుంటారు. మరికొందరు మాత్రం పెళ్లికి ముందే వ్యాపకాలు పెట్టుకుటున్నారు. ఏదీ జరిగినా ఈ కార్యం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే చర్చలు ఇప్పటికే పలు సార్లు జరిగాయి. అలాగే పెళ్లయిన తరువాత వారానికి ఎన్ని సార్లు జీవిత భాగస్వామతో కలవాలి? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు వ్యక్తుల్లో ఈ కార్యంలో పాల్గొనడానికి ఒకరికి ఆసక్తి ఉన్నా.. మరొకరికి ఉండకపోవచ్చు. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? ఆ వివారాల్లోకి వెళితే..
నేటి కాలంలో చాలా మంది ఏదో ఒక పనితో బిజీ అవుతున్నారు. క్రమంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో రాత్రి ఇంటికి రాగానే అలసిపోయి జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండలేకపోతున్నారు. కానీ ఇలా కొన్ని కారణాల వల్ల వారికి దూరంగా ఉండడం వల్ల రాను రాను ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవచ్చు. అంతేకాకుండా ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోవచ్చు. అందువల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండాలంటే శృంగారం ఉండాలని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అయితే వారానికి ఎన్నిసార్లు ఈ కార్యంలో పాల్గొంటే దంపతులు సంతోషంగా ఉంటారు?
చాలా మంది నేటి కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు వేర్వేరు ప్రదేశాల్లో ఉద్యోగాలు చేయడం ద్వారా ప్రతిరోజూ కలుసుకోవాలంటే కుదరదు. అలాగని కనీసం వారానికి ఒకసారి కూడా ప్రేమగా ఉండకపోతే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందువల్ల ఓ నివేదిక ప్రకారం వారంలో ఒకసారి అయినా పడక గదిని పంచుకోవడం ద్వారా మనసు ఉల్లాసంగా మారుతుంది. అవకాశం ఉన్న వారు వారంలో మూడు సార్లు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండొచ్చు. కనీసం వారానికి ఒకసారి కూడా ఈ క్రియ జరపకతోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి.
అయితే మితిమీరిన ఈ పని మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు మిగతా పనులను పక్కనబెట్టి ఇదే పనిపై శ్రద్ధ పెడుతారు. ఎదుటివారికి ఇష్టం లేకపోయినా పదే పదే ఇందులో పాల్గొనడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో నడుం నొప్పి తీవ్రంగా వేధిస్తుంది. అందువల్ల ప్లానింగ్ ప్రకారంగా ఈ కార్యంలో పాల్గొనడం మంచిదని అంటున్నారు. ఇక ఈ పనికి ఒకరికి ఆసక్తి ఉన్నా..మరికొరికి అనాసక్తి ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగలాంటే ఆహ్లదకరమైన వాతావరణంలోకి వెళ్లాలి.అవసరమైతే ఇతర ప్రదేశాల్లో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. ప్రశాంతమైన వాతావరణం మనసును ఉల్లాసంగా ఉంచుతుంది