Ravi Teja: రవితేజ 6 సినిమాల్లో ఇదే కామన్ పాయింట్.. దర్శకులు కావాలనే అలా చేశారా?

మాస్ సినిమాలు కావాలా?, ఫైటింగ్ ఇరగదీయాలా?.. జోక్స్ పేలాలా ఇలా ఎలాంటి పాత్ర కావాలన్నా ఇరగదీస్తారు రవితేజ. మేనరిజం, అద్భుతమైన నటనతో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రవితేజ.

Written By: Swathi, Updated On : February 14, 2024 10:00 am
Follow us on

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అని భావించే వారు చాలా మంది ఉంటారు. అది కొంత వరకు నిజం అయినా అన్ని విషయాల్లో నిజం కాదు. ఎందుకంటే సింగిల్ గా వచ్చి కష్టపడి హీరోలుగా మారి సునామీలు సృష్టిస్తున్న హీరోలు కూడా ఉన్నారు. కొన్ని సార్లు ఫ్లాప్ లు కొన్ని సార్లు హిట్లు అంటున్నా కూడా ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాస్ రాజా రవితేజ.

మాస్ సినిమాలు కావాలా?, ఫైటింగ్ ఇరగదీయాలా?.. జోక్స్ పేలాలా ఇలా ఎలాంటి పాత్ర కావాలన్నా ఇరగదీస్తారు రవితేజ. మేనరిజం, అద్భుతమైన నటనతో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రవితేజ. ఇక రీసెంట్ గా వచ్చిన ఈగల్ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. రవితేజ మాత్రం ఇందులో డిఫరెంట్ పాత్రను పోషించారు. అయితే ఈ సినిమాకు రవితేజ నటించిన పాత సినిమాలకు ఒక పోలిక ఉంది. అదేంటి అనుకుంటున్నారా?

అందరూ డైరెక్టర్లు అనుకొని సినిమా చేస్తున్నారా? ఏంటి అని మాత్రం అనుకోకండి.. కానీ అందరి సినిమాల్లో ఈ కామన్ పాయింట్ మాత్రం ఉంటుంది. అదేనండి రవితేజ సినిమాల్లో ఒక హీరోయిన్ చనిపోవడం. రీసెంట్ గా వచ్చిన ఈగల్ సినిమాలో కూడా కావ్య థామస్ చనిపోతారు. అంతకుముందు రవితేజ నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఇలానే జరిగింది. షాక్ లో జ్యోతిక, వీర సినిమాలో కాజల్ అగర్వాల్, టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నుపుర్ సనన్, డిస్కో రాజా సినిమాలో పాయల్ రాజ్ పుత్, బలుపు సినిమాలో అంజలి చనిపోతారు. అయితే ఇక్కడ మరో కామన్ పాయింట్ కూడా ఉందండోయ్.. ఈ హీరోయిన్ లు అందరూ కూడా ఫ్లాష్ బాక్ లోనే చనిపోతారు.

ఇక హీరోయిన్ లు చనిపోయిన తర్వాత మాస్ రాజా పగ తీర్చుకోవడం లేదా ఇతర చోటికి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు రవితేజ. వీరి కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో..