Australia Vs West Indies: ఆస్ట్రేలియా వెస్టిండీస్ తో జరిగిన మూడోవ టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ 37 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం నిర్ణీత 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. వెస్టిండీస్ ప్లేయర్లలో రసెల్, రూథర్ ఫర్డ్ ఇద్దరు కలిసి ఆరో వికెట్ కు 139 పరుగులు జోడించి ఇంతకుముందు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేశారు.
ఇక ఇంతకు ముందు పవుమా న్యూ గినియా జోడి (టోనీ ఉరా నార్మన్ వనువా) పేర్ల మీద నమోదైంది. ఇక 2022లో జరిగిన ఓ మ్యాచ్ లో పవుమా జోడి ఆరో వికెట్ కి 115 పరుగుల పత్నార్షిప్ ను నెలకొల్పింది. ఇక ఇంతకు ముందు ఆస్ట్రేలియన్ ప్లేయర్లు అయిన మైక్ హస్సి – కెమెరాన్ వైట్ శ్రీలంక మీద జరిగిన మ్యాచ్ లో 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు…
ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ప్లేయర్లు ఎవరు పెద్దగా రాణించినప్పటికీ రసెల్, రూథర్ ఫర్డ్ ఇద్దరు మాత్రమే రాణించడం తో వెస్టిండీస్ భారీ పరుగులు చేయగలిగింది. రసల్ 29 బంతుల్లో 7 సిక్సులు నాలుగు ఫోర్లతో 71 పరుగులు చేయగా, రూథర్ ఫర్డ్ 40 బంతుల్లో 5 సిక్స్ లు, 5 ఫోర్లతో 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లలో బర్త్ లేట్ 2 వికెట్లు తీయగా, బెహరన్డ్, జాన్సన్, జంపా, హార్డీ లు తలో వికెట్ తీశారు…
ఇక 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీం కొద్ది వరకు గట్టి పోటి ఇచ్చినప్పటికీ ఫైనల్ గా మాత్రం మ్యాచ్ ను గెలవలేకపోయింది. ఆస్ట్రేలియన్ టీం లో డేవిడ్ వార్నర్ ఒక్కడే 81 పరుగులు చేసి హార్డ్ హిట్టింగ్ చేసినప్పటికీ అతనికి తోడుగా మరొక ప్లేయర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇక టీమ్ డేవిడ్ 40 పరుగులు చేసి కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ, అతనికి తోడుగా ఆడే మరో ప్లేయర్ లేకపోవడంతో ఆస్ట్రేలియా టీమ్ నిర్ణీత 20 ఓవర్ల కు 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది… దాంతో 37 పరుగుల తేడాతో వెస్టిండీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక మూడు టి20 మ్యాచ్ ల్లో భాగంగా మొదటి రెండు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా గెలిచి తన సత్తాను చాటుకుంటే, చివరి మ్యాచ్ లో మాత్రం వెస్టిండీస్ భారీ విక్టరీ ని సాధించింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా ఈ సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది.