https://oktelugu.com/

వరుణ్ తేజ్ పెళ్లి నాగబాబు హాట్ కామెంట్స్ !

మెగా బ్రదర్ నాగబాబు మొత్తానికి తన బాధ్యతలను తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన ఆయన, ఇక తన తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే వరుణ్ పెళ్లి పై గతంలోనే ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన నాగబాబు, తాజాగా మళ్ళీ కామెంట్స్ చేసాడు. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అంటూ అటు అభిమానులతో పాటు, మీడియా కూడా నాగబాబును తెగ అడుగుతున్నారట. ఎక్కడ కనిపించినా […]

Written By:
  • admin
  • , Updated On : January 27, 2021 / 11:32 AM IST
    Follow us on


    మెగా బ్రదర్ నాగబాబు మొత్తానికి తన బాధ్యతలను తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన ఆయన, ఇక తన తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే వరుణ్ పెళ్లి పై గతంలోనే ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన నాగబాబు, తాజాగా మళ్ళీ కామెంట్స్ చేసాడు. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అంటూ అటు అభిమానులతో పాటు, మీడియా కూడా నాగబాబును తెగ అడుగుతున్నారట.

    ఎక్కడ కనిపించినా ఇదే ప్రశ్న అడగడంతో నాగబాబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నా కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నా పర్లేదు, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న పర్లేదు. అమ్మాయి వరుణ్‌ కు అన్ని విధాల సరిజోడీనా కాదా అన్నదే చూస్తాం’ అని నాగబాబు తన కొడుకు పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. కూతురు నిహారిక వివాహాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో చేశారు నాగబాబు . ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలివచ్చింది.

    ముఖ్యంగా వరుణ్ తేజ్ దగ్గర ఉండి మరీ పెళ్లి పనులు చూసుకోవడం అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తతం వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘గని’ అనే చిత్రంలో ఓ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసింది. ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక వరుణ్ ఈ సినిమాతో పాటు ‘ఎఫ్3’లో కూడా నటిస్తున్నాడు. పూర్తి కామెడీతో సాగనున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.