https://oktelugu.com/

Happiness: వీటిని వదిలేయండబ్బా.. సంతోషం మీ వెంటే ఉంటుంది..

లైఫ్ బాగుండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. కొన్నింటికి దూరంగా, కొందరికి దగ్గరా ఉండాలి. మనకి తెలిసి తెలియక చేసే కొన్ని అలవాట్లే మనల్ని ఎక్కువ బాధ పడెతుంటాయి. వాటి కారణంగా మనం తెలియకుండానే ఎక్కువగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 19, 2024 5:23 pm
    Happiness

    Happiness

    Follow us on

    Happiness: ప్రస్తుతం చాలా మంది లైఫ్ స్టైల్ అస్తవ్యస్తంగా మారింది. సంతోషం, ఎంజాయ్, హ్యాపీ, జాయ్ వంటివి లేకుండానే జీవితాలు గడిచిపోతున్నాయి. ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుంది. బయట కంఫర్టబుల్ లేని లైఫ్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఎదుటి వారితో ఇబ్బంది, ఇంట్లో వారితో గొడవలు, అయిన వారితో నో రిలేషన్, కానివారితో కయ్యాలు అంటూ లైఫ్ చాలా డిఫికల్ట్ గా మారుతుంది. ఇలాంటి లైఫ్ నే లీడ్ చేస్తున్నారు చాలా మంది. మరి లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ వల్ల జీవితం అందంగా మారుతుంది. ఎలంటి టిప్స్ వల్ల సంతోషంగా ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారా? అయితే జస్ట్ సింపుల్ ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివేసేయండి చాలు. మీకు కొన్ని చిన్న చిన్న టిప్స్ తెలుస్తాయి. కానీ అవి పెద్ద రిలీఫ్ ను ఇస్తాయి.

    లైఫ్ బాగుండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. కొన్నింటికి దూరంగా, కొందరికి దగ్గరా ఉండాలి. మనకి తెలిసి తెలియక చేసే కొన్ని అలవాట్లే మనల్ని ఎక్కువ బాధ పడెతుంటాయి. వాటి కారణంగా మనం తెలియకుండానే ఎక్కువగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాం.

    తప్పులు. మన తప్పులు మనకు అసలు తెలియవు. కానీ ఎదుటి వారి తప్పులు మాత్రం ఇట్టే కనిపిస్తాయి. అందుకే ఎప్పుడు కూడా ఇతరులు చేసే పనులు తప్పు అని, వారు ఏం చేసినా నెగటివ్ అంటూ మాట్లాడవద్దు. వారి మీద ద్వేషం పెంచుకోవద్దు. దీని వల్ల మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బ తిని వారి కంటే దారుణంగా మీరు మారే అవకాశం ఉంది జాగ్రత్త.

    ఎదుటి వారి బాధ. ఎదుటి వారు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే మనకు బాధ అనిపించాలి. లేదంటే జస్ట్ నార్మల్ గా అనిపించాలి. అప్పుడే మీ మనసు మంచిది అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎదుటి వారి బాధను మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నా?, వారి బాధను మీరు సంతోషంగా ఫీల్ అయినా మీ మెంటాల్టీ రాక్షసత్వంతో కూడుకున్నదని అర్థం చేసుకోవచ్చు. సో ఇది మీలో ఉంటే ఇప్పుడే చెప్పకుండీలో వేసేయండి. ఎదుటి వారి బాధలో సంతోషాన్ని వెతుక్కోవద్దు.

    కోపం: చిన్న సమస్య ఉన్నా పెద్దగా అరవడం, ప్రతి ఒక్కరి మీద అజమాయిషీ చెలాయించడం, పెద్దరికం నిలబెట్టుకోకపోవడం వంటివి కోపం వల్లనే జరుగుతాయి. అందుకే ఈ కోపం అస్సలు మంచిది కాదు. మీ కోపం వల్ల ఇతరులకు బాధ అనిపిస్తుంది. కోపంలో చాలా తప్పులు చేయడం కూడా సహజమే. మాటలు కూడా కంట్రోల్ లో ఉండవు. ఒకరిని మాటలు అన్న తర్వాత మీరు బాధ పడినా సరే ఆ మాటలు వెనక్కు తీసుకోలేరు. సో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ వల్ల అవడం లేదా? వాకింగ్, వ్యాయామం, యోగా వంటివి చేయండి. చాలా కూల్ గా ఉంటారు. కోపంలో ఇతరులు అరుస్తూ ఉన్నా సైలెంట్ గా కూర్చోవడం కూడా కష్టమే. కానీ రియాక్షన్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా ఒకసారి ఆలోచించండి.

    పోల్చుకోవడం: మీ లైఫ్ మీకు ప్రత్యేకం. ఇతరులతో అసలు పోల్చుకోవద్దు. ఇతరులతో పోల్చుకోవడం వల్ల నష్టమే ఎక్కువ. ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. బాధ పడరు.

    స్వార్థం: ఈ క్వాలిటీ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అన్నీ సార్లు స్వార్థం ఉండటం మనిషికి మంచిది కాదు. స్వార్థం వల్ల మీకు మంచి జరగాలి కానీ ఎదుటి వారికి నష్టం జరగవద్దు. ఇలా చేస్తే మనశ్శాంతి కరువు అవుతుంది. సో ఇది మనకి మంచిది కాదన్నమాట. అందుకే, స్వార్థాన్ని విడిచిపెడితే హ్యాపీగా ఉండవచ్చన్నమాట. ఏది జరిగినా సరే మన మంచికే అనుకోండి. అందరు మనవారే అనుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే విధంగా, ఇతరులకి సాయం చేయడం కూడా జర అలవాటు చేసుకోండి. ఈ లక్షణాలు కొన్ని కష్టంగా అనిపించినా మంచి ఫలితాలను అందిస్తాయి.