https://oktelugu.com/

Pimples: పింపుల్స్ వేధిస్తున్నాయా? నలుగురిలోకి వెళ్లాలంటే మొహం చాటేస్తున్నారా? జస్ట్ ఈ పండ్లను తినండి మొటిమలు మాయం అవుతాయి..

మొటిమలను తగ్గించే వాటిల్లో బెర్రీలు ముందు వరుసలో ఉంటాయి. ఈ స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీల్లు మొటిమలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అంటున్నారు నిపుణులు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 20, 2024 / 04:00 AM IST

    Pimples

    Follow us on

    Pimples: పింపుల్స్ తో చాలా మంది బాధ పడతారు. ఫేస్ అందంగా ఉండాలని చాలా మందికి ఉంటుంది. కానీ స్కిన్ పాడవడం, పొడిబారడం, పింపుల్స్, నల్ల మచ్చలు వంటివి బాధ పెడుతుంటాయి. మరీ ముఖ్యంగా మొహం మీద కురుపులు ఉంటే అసలు బాగోదు కదా. ఈ సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, ఎన్ని పార్లర్స్ కు వెల్లినా సరే కొంత మందికి ఈ సమస్య తీరడం లేదు. పింపుల్స్ వచ్చాయంటే అంత తేలిగ్గా వెళ్లవు కూడా. మొటిమలు వచ్చాక మచ్చలు పడతాయి. అందుకే చాలా మంది పింపుల్స్ సమస్యను తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా నో యూజ్ అంటారు కొందరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పండ్లు తింటే పింపుల్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివేసేయండి.

    బెర్రీలు: మొటిమలను తగ్గించే వాటిల్లో బెర్రీలు ముందు వరుసలో ఉంటాయి. ఈ స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీల్లు మొటిమలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అంటున్నారు నిపుణులు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. సో స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ వంటి బెర్రీ ఫ్రూట్ లు కనిపిస్తే వదలకండి. కేకుల మీద ఉన్న బెర్రీలను చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇవి మీకు మంచి హెల్ప్ అవుతాయి.

    యాపిల్: యాపిల్ ను తినడం వల్ల కూడా మొటిమలు రావు అంటున్నారు నిపుణులు. మొటిమలతో బాధ పడేవారు యాపిల్‌ను డైలీ లైఫ్ లో భాగం చేసుకోవాలి. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తాయి.

    ఆరెంజ్: ఆరెంజ్ లు తింటే కూడా పింపుల్స్ కు దూరంగా ఉండవచ్చు. ఇవి విటమిన్ సి మంచి మూలంగా చెబుతుంటారు నిపుణులు. మొటిమల వలన వచ్చే వాపును, మచ్చలను తగ్గిస్తుంది విటమిన్ సి. ఈ ఆరెంజ్ లో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. సో వీటిని కూడా తినేయండి.

    పైనాపిల్: పైనాపిల్ తింటే కూడా మొటిమలు రాకుండా నియంత్రించుకోవచ్చు. ఇందులో ఉండే బ్రోమెలైన్ పింపుల్స్, వీటి నుంచి వచ్చే ఎరుపు, వాపులను తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. కానీ పైనాపిల్ తినడానికి చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి. ఎక్కువ మందికి ఇది నచ్చకపోవచ్చు. అయినా సరే శరీరం కోసం, స్కిన్ కోసం తినాలి కాబట్టి అప్పుడప్పుడు అయినా సరే ఈ పైనాపిల్ ను మీ పొట్టలో పడేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్యూటీ స్కిన్ డియర్స్.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.