Drinking Water : వాటర్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా ప్రతి రోజు వాటర్ తాగాలి. కచ్చితంగా ఆరు లీటర్లు మాత్రం వయసును బట్టి నీరు తాగాలి అంటారు నిపుణులు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ నీరు చాలా అవసరం. నీరు విషయంలో అసలు నెగ్లెట్ చేయవద్దు. చేస్తే ఆ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరం డీ హైడ్రేట్ అవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకే ఎక్కువగా నీరు తాగాలి. నీటి వల్ల చర్మం కూడా నిగారిస్తుంది.
మన శరీరానికి నీరు చాలా అవసరం. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలంటే కూడా నీరు ఉపయోగపడుతుంది. హెల్తీ గా ఉంచుతుంది నీరు. కానీ నీళ్లను సరిగ్గా తాగకుండా లైట్ తీసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగితే మరింత ఎక్కువ సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా నిల్చొని నీరు తాగడం వల్ల కడుపులో ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది.
జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కూర్చొని నీళ్లు తాగడం వల్ల శరీరంలో పోషకాలను బాగా గ్రహిస్తుంది. అదే నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాదు ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. నిలబడి నీళ్లు తాగితే శరీరానికి ఆక్సిజన్ కూడా సరిగ్గా అందదు అంటున్నారు నిపుణులు. దీని వల్ల ఊపిరి సమస్యలు కూడా వస్తాయి. కిడ్నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కూర్చొని నీళ్లు తాగడం వల్ల కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి పడదు. కానీ నిల్చొని తాగితే మాత్రం పడుతుంది. అందుకే కూర్చుని నీరు తాగాలి. దీనివల్ల వ్యర్థాలు కూడా ఈజీగా బయటకు వెళ్లిపోతాయి. కానీ నిలబడి నీళ్లు తాగితే మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది.
ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నిలబడి నీళ్లు తాగితే కీళ్ల సమస్యలు, ఎముకల సమస్యలు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. కీళ్లలో ద్రవం పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే కుదిరితే కూర్చుని మాత్రమే నీరు తాగండి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాస్త ఉప్పు కలుపుకుని తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇలా నీరు తాగడం వల్ల పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలా గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకొని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..