https://oktelugu.com/

Tulsi : ఈ వస్తువులను తులసి కోట వద్ద ఉంచండి. ఐశ్వర్యవంతులు అవుతారు..

హిందూ మతంలో తులసి మొక్కకు చాలా పవిత్రమైన స్థానం ఇచ్చారు. దీన్ని ఆరాధించడమే కాదు మంచి ప్రయోజనాలను అందిస్తుందని కూడా నమ్ముతారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 19, 2024 / 01:00 AM IST

    Tulsi

    Follow us on

    Tulsi : హిందూ మతంలో తులసి మొక్కకు చాలా పవిత్రమైన స్థానం ఇచ్చారు. దీన్ని ఆరాధించడమే కాదు మంచి ప్రయోజనాలను అందిస్తుందని కూడా నమ్ముతారు. ఎన్నో ప్రయోజనాలు ఉండే తులసి దగ్గర కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు మీ మీదే ఉంటాయి అంటున్నారు పండితులు. అంతేకాదు ఇంట్లో సంపద కూడా పెరుగుతుందట.

    సాయంత్రం సమయంలో తులసి మొక్క వద్ద నెయ్యి దీపం పెట్టండి. ఇలా నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం. ఇలా ఆరాధిస్తే తులసి ప్రసన్నం అవుతుందట. లక్ష్మీ దేవి అనుగ్రహం మీద ఉంటుంది. అంటే మీకు సంపద వస్తుంది. ఇక తులసి మంజరిని ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోతుంది.అంతేకాదు ధన, ధాన్యాల నిల్వ నిండుగా ఉంటుందట. ఇక తులసి దగ్గర మనీ ప్లాంట్ నాటాలి. ఇలా నాటితే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండు మొక్కలు ఒకదాని కొకటి శక్తిని అందించుకుంటాయి. ఇంట్లో సంపదకు కొత్త మార్గాలు ఓపెన్ అవుతుంటాయి.

    తులసి దగ్గర మట్టి ప్రమిదలో దీపం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. తులసి మొక్క దగ్గర అక్షంతలు లేదా పసుపు పెట్టాలి . అక్షంతలు, పసుపులను ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. తులసి దగ్గర వెండి నాణెం లేదా ఇతర లోహాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల శుభానికి చిహ్నంగా ఉంటుంది. ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతున్నారు పండితులు.

    ప్రజలు చాలా మంది కూడా తులసి మొక్కకు ఎంతో భక్తితో పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది ఇంటి ముందు ఈ తులసి మొక్క ఉంటుంది. మహిళలు తమ పసుపు కుంకుమలు పదికాలాల పాటు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తుంటారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, నియమాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్న విషయం తెలిసిందే. తులసి తీర్థం అన్నమాట మీరు వినే ఉంటారు. తులసి తీర్థం లేదా తులసి రసానికి హిందూ సంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారణి అంటారు పెద్దలు. మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతుంది కాబట్టి ఈ తులసి చాలా మంచిదని భావిస్తారు.

    అందుకే ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి, వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఆరోగ్యాన్ని రక్షించుకొని, తులసి తీర్థం సేవించాలి. తులసి సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించే వారికి కాస్త వ్యాధులు కూడా తక్కువే వస్తాయి. తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు ఉంటారట. తులసి దళములలో పుష్కరాది తీర్ధాలు, గంగ మొదలగు నదులు, వాసుదేవది దేవతలు నివసిస్తారట.