https://oktelugu.com/

Gas Cylinder: సడెన్‌గా గ్యాస్ అయిపోయిందా.. ఇలా క్షణాల్లో బుక్ చేసుకోండి

అర్జెంటుగా మీకు గ్యాస్ సిలిండర్ కావాలంటే ఈజీగా వెంటనే ఇంటికి తెప్పించుకోవచ్చు. అయితే మీ గ్యాస్ సిలిండర్ అనేది ఏ కంపెనీ అనేది తెలుసుకుని వాట్సాప్‌లో కొన్ని నంబర్లకు మెసేజ్ చేయాలి. మీ గ్యాస్ కంపెనీ హెచ్‌పీ అయితే 9222201122 లేదా 771895555 నంబర్లకు, అదే ఇండియన్ గ్యాస్ అయితే 7588888824 నంబర్‌కు, అదే భారత్ గ్యాస్ అయితే 1800224344 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాలి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 12:03 AM IST

    Gas Cylinder

    Follow us on

    Gas Cylinder:ప్రస్తుతం రోజుల్లో అందరూ కూడా గ్యాస్ పైనే వంట చేస్తున్నారు. అన్ని వంటలు కూడా గ్యాస్ మీద చేయడం వల్ల ఎక్కువ రోజులు రాదు. సడెన్‌గా గ్యాస్ అయిపోయింది ఏమోనని కొన్నిసార్లు మనమే చెక్ చేస్తుంటాం. గ్యాస్ సిలిండర్ కాస్త ఖాళీగా అనిపిస్తే అయిపోతుందని అనుకుంటాం. దీంతో అప్పడే ఎక్స్‌ట్రా గ్యాస్ సిలిండర్ సేఫ్‌గా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకోకపోతే ఒక్కోసారి గ్యాస్ మధ్యలో అయిపోతుంది. దీంతో వంట మధ్యలో ఆగిపోతుంది. ఇలాంటి సమయాల్లో టెన్షన్ అంతా ఇంతా కాదు. సగంలో ఉన్న పాడవుతుంది. వెంటనే గ్యాస్ సిలిండర్ కూడా తెచ్చుకోలేం. ఇంకా ఏం చేయలేక కొందరు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటారు. దీనిపై వంట చేయడం మంచిదే. కానీ కాస్త ఆలస్యం అవుతుంది. వెంటనే కట్టెల పొయ్యి మీద కష్టం అవుతుంది. ఇలాంటి సమయాల్లో వెంటనే గ్యాస్ కావాలంటే ఎక్కడికి వెళ్లకుండా ఈజీగా ఇలా బుక్ చేసుకుంటే మీ సమస్య క్లియర్ అవుతుంది. అది ఎలాగో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    అర్జెంటుగా మీకు గ్యాస్ సిలిండర్ కావాలంటే ఈజీగా వెంటనే ఇంటికి తెప్పించుకోవచ్చు. అయితే మీ గ్యాస్ సిలిండర్ అనేది ఏ కంపెనీ అనేది తెలుసుకుని వాట్సాప్‌లో కొన్ని నంబర్లకు మెసేజ్ చేయాలి. మీ గ్యాస్ కంపెనీ హెచ్‌పీ అయితే 9222201122 లేదా 771895555 నంబర్లకు, అదే ఇండియన్ గ్యాస్ అయితే 7588888824 నంబర్‌కు, అదే భారత్ గ్యాస్ అయితే 1800224344 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాలి. ఇలా మెసేజ్ చేసిన తర్వాత మీకు మెనూ వస్తుంది. అందులో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ మెనూలో గ్యాస్ సర్వీస్, రీఫీల్, కొత్త గ్యాస్ కావాలన్నా లేదా ఫిర్యాదు చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఆప్షన్‌పై క్లిక్ చేసి డిటైల్స్ ఇస్తే చాలు గ్యాస్ వెంటనే మీ ఇంటికి వస్తుంది. వంట చేస్తున్న మధ్యలో గ్యాస్ అయిపోయిన కూడా మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ నంబర్లు మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి.

    ఇదే కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంది. గ్యాస్ సిలిండర్ సడెన్‌గా అయిపోతే కస్టమర్లకు ఇబ్బంది ఉండకూడదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చిన్న సైజ్ గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చింది. 5కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ-FTL‌ను కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. పెద్ద సిలిండర్ బుక్ కాకపోతే వెంటనే దీన్ని బుక్ చేసుకున్న మీ వంటకు ఎలాంటి అంతరాయం ఉండదు. దీనికి ఎలాంటి వివరాలు, అడ్రస్ ఫ్రూఫ్ లేకపోయిన కూడా గ్యాస్ సిలిండర్‌ను ఇస్తారు. మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి ఈ గ్యాస్ సిలిండర్‌ను తెచ్చుకోవచ్చు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.