https://oktelugu.com/

OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే యాక్షన్… అసలు మిస్ కావద్దు!

OTT Releases: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీస్టారర్ బడే మియా చోటే మియా. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదలైంది. మూడు వందలకు పైగా బడ్జెట్ తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కింది.

Written By: , Updated On : June 3, 2024 / 05:03 PM IST
OTT releases this week

OTT releases this week

Follow us on

OTT Releases: యాక్షన్ ప్రియులకు పండగే. ఈ వారం భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. నాన్ స్టాప్ వినోదం పంచనున్నాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఈ వారం అందుబాటులో వచ్చిన సినిమాలు ఏమిటో? అవి ఎక్కడ చుడొచ్చో? తెలుసుకుందాం.. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీస్టారర్ బడే మియా చోటే మియా. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదలైంది. మూడు వందలకు పైగా బడ్జెట్ తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు.

చోటే మియా బడే మియా(Bade Miyan Chote Miyan) చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. మానుషీ చిల్లర్, అల్య ఎఫ్ హీరోయిన్స్ గా నటించారు. కాగా బడే మియా చోటే మియా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. జూన్ 6 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.

Also Read: Project Z: సందీప్ కిషన్ బెస్ట్ మూవీ..కానీ ఓటీటీలోకి రావడానికి ఆరు సంవత్సరాల పట్టిందా?

హిందీ సక్సెస్ఫుల్ సిరీస్ గుల్లక్(Gullak). ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇది కామెడీ అండ్ సెటైరికల్ ఫ్యామిలీ డ్రామా. కాగా సీజన్ 4 స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. గుల్లక్ సీజన్ 4 జూన్ 7వ తేదీ నుండి సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది. కామెడీ ప్రియులను బాగా ఆకట్టుకునే సీరీస్ ఇది.

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ స్టార్ వార్: ది అకోలైట్(Star Wars The Acolyte). డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టార్ వార్: ది అకోలైట్ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్స్ ఇష్టపడే వారు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. రేపటి నుండే ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది.

Also Read: OTT Movies: ఓటీటీ ప్రియులకు పండగే పండగ… సినిమాలు, సిరీస్లతో అదిరిపోయే కంటెంట్ సిద్ధం!

నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ది ప్రైస్ ఆఫ్ నొన్నాస్ ఇన్హెరిటెన్స్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. జూన్ 4 నుండి ది ప్రైస్ ఆఫ్ నొన్నాస్ ఇన్హెరిటెన్స్ అందుబాటులోకి రానుంది. ఓ బామ్మ చుట్టూ అల్లుకున్న ఫ్యామిలీ డ్రామానే ది ప్రైస్ ఆఫ్ నొన్నాస్ ఇన్హెరిటెన్స్. వీటితో పాటు మరిన్ని చిత్రాలు, సిరీస్లు ఈ వారం వివిధ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ కానున్నాయి.