Skin Care Tips: ఈ రోజుల్లో, ఇంటర్నెట్‌లో అనేక రకాల టిప్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో బియ్యం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొందరు బియ్యం నీళ్లను ముఖానికి రాసుకుంటే మరికొందరు హెయిర్ టానిక్‌గా రాసుకుంటున్నారు. బియ్యం పిండి మన చర్మానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? అయితే ఈ రోజు బియ్యం గురించి ప్రయోజనాలు, వాటితో ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
ఈ రెసిపీ మీ ముఖంలోని మురికిని శుభ్రం చేయడమే కాకుండా మచ్చలను తేలికపరచడంలో సహాయపడుతుంది. మీ ముఖానికి అద్భుతమైన మెరుపును తెచ్చే బియ్యప్పిండిలో ఓ మూడు పదార్థాలు కలిపితే ప్రయోజనాలు మరింత ఎక్కువ కలుగుతాయి.
బియ్యప్పిండిని ముఖానికి రాసుకుంటే మంచిదేనా?
బియ్యపు పిండిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి, మృత చర్మాన్ని తొలగించడానికి, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి బియ్యం పిండిని ఉపయోగిస్తారు. రైస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం?
రైస్ ఫేస్ ప్యాక్ చేయడానికి ఏం కావాలి?
బియ్యం పిండి – 2 స్పూన్లు
అలోవెరా జెల్ – 2 స్పూన్లు
తేనె – 2 స్పూన్లు
నిమ్మరసం – 1 టీస్పూన్
పసుపు- చిటికెడు
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, తేనె, అలోవెరా జెల్, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా సిద్ధం చేసుకున్న ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వండి.
తర్వాత మీ ముఖాన్ని శుభ్రమైన గోరువెచ్చని నీటితో కడగాలి. దీని వల్ల మీ స్కిన్ మెరుస్తుంది. ఇదే కంటిన్యూ అవ్వాలంటే వారానికి రెండు రోజులు ఈ రెమెడీని ఉపయోగించవచ్చు.
రెమెడీ 2..
దీని కోసం మీరు ఇంట్లో ఉంచిన బియ్యాన్ని ఉపయోగించవచ్చు. మీ ఇంట్లో ఉడకబెట్టిన అన్నం మిగిలి ఉంటే, మీరు దానిని మీ ముఖానికి ఉపయోగించవచ్చు. అన్నాన్ని ఎలా ఉపయోగించవచ్చు అనుకుంటున్నారా?
అన్నం – ఒక గిన్నె
తేనె – 2 స్పూన్లు
అలోవెరా జెల్ – 2 స్పూన్లు
గులాబీ రేకుల పేస్ట్ – 2 టీస్పూన్లు
రైస్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి?
ఇందుకోసం ఉడకబెట్టిన అన్నాన్ని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అందులో అలోవెరా జెల్, తేనె కలపాలి . ఆ తర్వాత గులాబీ రేకులతో చేసిన పేస్ట్‌ని అందులో వేయాలి. వీటన్నింటిని కొద్దిగా నీరు పోసి కలపాలి.
దీన్ని ముఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీన్ని అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ ముఖంపై గులాబీ రంగు వస్తుంది. ముఖానికి అన్నం రాసుకుంటే వండిన అన్నం మాత్రమే ఉపయోగించాలి. అన్నంలో ఇంకేదైనా చేర్చే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. మీరు ఫేస్ మాస్క్ తయారు చేస్తుంటే, ఎక్కువ కాలం నిల్వ ఉంచవద్దు. ముఖానికి పూయడానికి తాజా ప్యాక్ ను మాత్రమే ఉపయోగించండి. ఇక మొటిమలు లేదా మొటిమల సమస్యలు వంటివి ఉంటే మాత్రం నిపుణుల సలహా లేకుండా ఈ ఫేస్ మాస్క్‌ని ఉపయోగించవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..