Daku Maharaj : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా బాలయ్య ఈ చిత్రంలో తక్కువ మాటలు ఎక్కువ యాక్షన్ చేసాడు. అభిమానులకు ఆయన సరికొత్త థియేట్రికల్ అనుభూతి ని కలిగించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు బంపర్ ఓపెనింగ్స్ ని సాధించుకున్న ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు బయటపడ్డాయి. ఈ చిత్రం లో బాలయ్య తర్వాత ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది వేదా అగర్వాల్. సినిమా మొత్తం ఈ చిన్నారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, ఎంతో ముద్దుగా నటించి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకునేలా చేసింది. ఇంతకీ ఎవరు వేదం అగర్వాల్, ఈమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఏమిటి అనేది చూద్దాం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే వేద అగర్వాల్ తండ్రి పేరు మాధవ్. తల్లి పేరు మేఘ. మాధవ్ బాలీవుడ్ లో మంచి ప్రఖ్యాతి గాంచిన ఒక సింగర్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి గాత్రం అందించిన ఆయన కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేసాడు. IIFA అవార్డ్స్ లో బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ఇతను నామినేషన్ కూడా అయ్యాడు. తెలుగు లో కూడా ఈయన పలు సినిమాలకు పాటలు పాడాడు కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపుని తీసుకొని రాలేదు. ఇంస్టాగ్రామ్ లో తన పాప వేద అగర్వాల్ తో కలిసి ఎన్నో ఫోటోలు, రీల్స్ చేశాడు. అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. డైరెక్టర్ బాబీ ఈ పాప ని చూసి ఎంతో ఇష్టపడి తన సినిమాలో తీసేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య కి వేద అగర్వాల్ వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయ్యింది.
మేకింగ్ వీడియోస్ కొన్ని చూస్తే షూటింగ్ పూర్తై బాలయ్య ని వదిలి వెళ్తున్న సమయంలో వేద బాగా ఏడ్చేస్తుంది. బాలయ్య ని ఆమె ప్రేమతో పట్టుకున్న సంఘటనలు చూస్తే చాలా ముచ్చట వేస్తాది. చిన్నతనంలోనే ఎంతో చక్కగా నటించిన ఈ చిన్నారికి భవిష్యత్తులో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి రోల్స్ వస్తాయి. కానీ ఆమె తల్లిదండ్రులు అందుకు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. బాలయ్య ప్రత్యేకించి అడిగాడు కాబట్టి కాదనలేక మాధవ్ ఈ సినిమాలో వేద నటించేందుకు ఒప్పుకున్నాడు కానీ, వేరే సినిమాలకు అంత తేలికగా ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇకపోతే డాకు మహారాజ్ చిత్రం మొదటి రోజు దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. రెండవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ గా మొదలయ్యింది.