Influenza vaccine Vaxiflu-4
Influenza virus : తెలంగాణలో హైదరాబాద్(Hyderabad) వ్యాక్సిన్ హబ్‌గా మారింది. అనేక వైరస్‌లకు, వ్యాధులకు ఇక్కడ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్‌కు కూడా హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించింది. తాజాగా భారతీయ ఔషధ తయారీ కంపెనీ మరో వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసింది. కొన్ని రోజులుగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ప్రజలను భయపెడుతోంది. ఫ్లూ నుంచి రక్షణకు డబ్ల్యూహెచ్‌వో(WHO) సిఫారసు మేరకు దేవంలోనే మొట్టమొదటి క్వా్ర‘వలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాక్సిన్ వ్యాక్సిఫ్లూ–4ను తయారు చేసింది జైడస్ లైఫ్ సైన్సెస్ బుధవారం తెలిపింది. ఈ టీకాను సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ (CDL) ఆమోదించిందని కంపెనీ తెలిపింది.
Also Read : హెచ్3ఎన్2తో ఇద్దరు మృతి: అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే
వైరస్ బలపడడంతో..
రాబోయే రోజుల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ మరింత బలపడే అవకాశం ఉన్నట్లు సంస్థ గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని నాలుగు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జాతులకు వ్యతిరేకంగా కాలానుగుణ రక్షణను, క్రియాశీల రోగ నిరోధకతను పెంచేలా క్వాడ్రివాలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ తీసుకొచ్చినట్లు కంపెనీ వివరించింది. దీని సంస్థ అహ్మదాబాద్(Ahmedabad)వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్(VTC) అభివృద్ధి చేసింది.
ఇన్‌ఫ్లూయెంజా ప్రభావం ఇలా..
ఇక ఇన్‌ఫ్లూయెంజా అనేది ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల సోకే దగ్గు, తుమ్ముల వ్యాప్తిని వ్యాక్సిన్ నివారిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి కావాల్సిన వ్యాక్సిన్ తీసుకోకపోతే తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మరణానికి దారితీయవచ్చు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా ఏటా 2.9 లక్షల నుంచి 6.5 లక్షల వరకు మరణిస్తున్నారు. అందుకే వ్యాక్సిన్ తయారీకి డబ్ల్యూహెచ్‌వో అనుమతి ఇచ్చింది.
Also Read : 6 నెలల్లో బాలికల క్యాన్సర్ వ్యాక్సిన్.. కేంద్రం వెల్లడి