https://oktelugu.com/

Cancer Vaccine: 6 నెలల్లో బాలికల క్యాన్సర్‌ వ్యాక్సిన్‌.. కేంద్రం వెల్లడి..!

క్యాన్సర్‌ కేసులు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఊరికి ఒకరిద్దరు మాత్రమే ఉండేవారు. కానీ ఇపుపడు వీధికి ఒకరు వ్యాధి బాధితులు ఉంటున్నారు. పొగ తాగడం, పొగాకు నమలడం ద్వారా క్యాన్సర్‌ వస్తుందని భావించేవారు. ఇప్పుడు అందరికీ వ్యాధి సోకుతోంది.

Written By: , Updated On : February 19, 2025 / 02:12 PM IST
Cancer Vaccine

Cancer Vaccine

Follow us on

Cancer Vaccine: దేశంలో క్యాన్సర్‌(Cancer) బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. మారుతున్న జీవనశైలి(Life style) ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లలు, పెద్దలు, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ వ్యాధి బారిన పడుతున్నారు. ఏటా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. భావితరాలు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈమేరకు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌(Vaccin Trails) నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఐదు నుంచి ఆరు నెలల్లో 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్లు వేస్తామని కేంద్ర కుటుంబ, ఆరోగ్య, సంక్షేమ, ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ పరిశోధనలు దాదాపు పూర్తికావొచ్చాయని తెలిపారు. ట్రయల్స్‌ పూర్తికాగానే అందరికీ వ్యాక్సిన్‌ వేస్తామన్నారు.

పెరుగుతున్న బాధితులు..
దేశంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్య పరిష్కరిచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆస్పత్రుల్లో స్క్రీనింగ్‌(Screening) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డేకేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జాదవ్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే భవిష్యత్‌లో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు తగ్గుతాయని తెలిపారు.

ఉచితంగా వ్యాక్సిన్‌..
వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికాగానే 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా అందిస్తామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్‌ సుంకాన్ని(Custams duty) ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తోంది. క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలు పెంచుతోంది. రాబోయే రోజుల్లో ప్రతీ జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించింది. మొత్తంగా క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది.