Ruturaj Gaikwad : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గత సీజన్ నుంచి రుతు రాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వివరిస్తున్నాడు. గత సీజన్లో తన కెప్టెన్సీ బాధ్యతలను మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. ఇక గత సీజన్లో చెన్నై జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయింది. కీలక మ్యాచ్లలో ఓడిపోయి అభిమానుల ఆశలను అడియాసలు చేసింది. ఈ నేపథ్యంలో ధోని లాగా రుతురాజ్ కు హైప్ తీసుకురావడానికి చెన్నై జట్టు మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా రుతురాజ్ కు సంబంధించిన ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తోంది. అలా పోస్ట్ చేసిన ఒక ఫోటో విమర్శలకు కారణమవుతోంది. సోషల్ మీడియా ఈ ఫోటోపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
Also Read : పదిలో తొమ్మిది కోల్పోయాడు.. దురదృష్టాన్ని తలచుకొని చింతిస్తున్న ధోని శిష్యుడు
అంత సీన్ లేదు
రుతు రాజ్ గైక్వాడ్ ప్రతిభ ఉన్న ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అతడు మహేంద్ర సింగ్ ధోనీ స్థాయిలో జట్టుపై ప్రభావం చూపించలేకపోయాడు. గత సీజన్లో ప్రతి మ్యాచ్ లోను అతడు ధోని సలహాలు తీసుకున్నాడు. ఈ ప్రకారం చూసుకుంటే ధోనికి వచ్చినంత స్థాయిలో రుతు రాజ్ గైక్వాడ్ కు పాపులారిటీ వస్తుందనుకోవడం చెన్నై జట్టు చేసిన అతి పెద్ద తప్పు. అతనికి కొంత సమయం ఇచ్చి.. భావి నాయకుడిని చేస్తే బాగుండేది. కానీ చెన్నై జట్టు ఆ దిశగా ఆలోచించకుండా.. ధోనికి మించిన స్థాయిలో రుతు రాజ్ గైక్వాడ్ కు హైప్ తీసుకురావాలని అనుకుంది. సోషల్ మీడియాలో అతడిని ఒక ధీరధాత్తమైన నాయకుడిగా చూపించే ప్రయత్నం చేసింది . ఇక్కడే చెన్నై జట్టు బొక్కా బోర్లా పడింది. మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో గైక్వాడ్ కెప్టెన్ అయినప్పటికీ.. అతని స్థాయి ఒక సంవత్సరంలోనే అందుకోలేడు. ఎందుకంటే ధోని 2008 నుంచి మొదలు పెడితే 2023 వరకు చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. జట్టులో తన మార్కు ఉండేలా చూసుకున్నాడు. అందువల్లే ధోని అంటే చెన్నై అభిమానులకు విపరీతమైన ఇష్టం. అతడిని తలా అని కూడా పిలుచుకుంటారు. అలాంటి ధోనికి అన్ని సంవత్సరాలు పట్టినప్పుడు.. గైక్వాడ్ కు ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఈ విషయాన్ని చెన్నై జట్టు మేనేజ్మెంట్ విస్మరించినట్టు ఉంది. అందువల్లే ఇలా సోషల్ మీడియాలో పసలేని ఫోటోలు పోస్ట్ చేస్తూ విమర్శల పాలవుతోంది.
The rise of Ruturaj Gaikwad! #WhistlePodu #DenComing pic.twitter.com/MVSQLmBH8j
— Chennai Super Kings (@ChennaiIPL) February 26, 2025