Homeవింతలు-విశేషాలుPigeons : పావురాలే కదా అని తిండి పెడితే.... జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది..

Pigeons : పావురాలే కదా అని తిండి పెడితే…. జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది..

Pigeons : చాలామందికి పావురాలను ఇష్టపడుతుంటారు. స్వేచ్ఛకు, శాంతికి కపోతాలుగా వాటిని భావిస్తుంటారు. కొందరైతే వాటి కోసం ప్రత్యేకంగా బోన్ లేదా గూడులను నిర్మించి పెంచుతుంటారు. అయితే అలా పెంచే అలవాటు ఉన్నవారు ఈ కథనం చదవాల్సిందే.

పావురంలో భిన్నమైన జీవ వైవిధ్యం ఉంటుంది. ముఖ్యంగా పావురం ఈకలు, రెట్టల పై ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉంటుంది.. ఇతర శరీర భాగాలపై రకరకాల వైరస్ లు ఉంటాయి. వీటన్నింటికీ అసంక్రామ్యత ను కలిగించే లక్షణాలు ఉంటాయి. పావురం ఈకలు, రెట్టలను పదేపదే తాకితే శరీరం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అది తీవ్రమైన అలర్జీకి దారితీస్తుంది. సరైన సమయంలో అలర్జీ నివారణకు చర్యలు తీసుకోకపోతే.. చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ 11 సంవత్సరాల బాలుడు ఇలాగే తరచూ పావురం ఈకలను, దాన్ని శరీరాన్ని పదేపదే తాకేవాడు. పావురాల రెట్టల్ని ముట్టుకునేవాడు. దీనివల్ల అతడి శరీరం తీవ్రంగా ప్రభావితమైంది. అతడికి లేనిపోని అలర్జీలు అంటుకున్నాయి. ఫలితంగా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు సర్ గంగారం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అలర్జీ వల్ల అతనికి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది ఏర్పడింది.. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు హైపర్ సెన్సిటివిటీ న్యూమో నైటీస్ (వైద్య పరిభాషలో హెచ్ పీ) తో బాధపడుతున్నాడని తేల్చారు. పావురాలను పదేపదే తాకడం, వాటికి సంబంధించిన ప్రోటీన్ల వల్ల ఆ బాలుడు ఈ అలర్జీకి గురయ్యాడని సర్ గంగారం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఏమిటీ హెచ్ పీ

హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అనేది ఊపిరితిత్తులకు సోకుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ వ్యాధి లక్ష మంది జనాభాలో ఇద్దరు లేదా ముగ్గురికి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.. ఇక ఢిల్లీలో హెచ్ పీ బారిన పాడిన బాలుడికి స్టెరాయిడ్ చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్న దృశ్య అతనికి హై ప్రెజర్ ఆక్సిజన్ తెరపి అందించారు. ఈ వైద్య విధానం ప్రకారం అతడి నాసిక రంద్రాలలో ట్యూబ్ ప్రవేశపెట్టారు. దానిద్వారా శరీరానికి ఆక్సిజన్ పంపించారు. దీనివల్ల ఆ బాలుడి ఊపిరితిత్తుల్లో వాపు తగ్గింది. శ్వాసను సజావుగా తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది..

పావురం రెట్టలు, ఈకలను పదేపదే తగలడం, లేదా వాటికి బహిర్గతం కావడం వల్ల హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ కు శరీరం గురవుతుంది. ఇదే కాదు ఈ – సిగరెట్ పొగ ద్వారా కూడా ఇలాంటి ఎలర్జీలు ఏర్పడతాయి. తక్షణం వైద్యుడిని సంప్రదించినప్పుడు సాధ్యమైనంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పక్షులకు దూరంగా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తరచూ అలర్జీలకు గురయ్యేవారు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు పక్షులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ” పక్షుల శరీరాలపై విపరీతంగా బ్యాక్టీరియా, వైరస్ ఉంటుంది. అలాంటప్పుడు అవి శరీరానికి తగిలినప్పుడు సత్వరమే స్పందిస్తుంది. అది రకరకాల అలర్జీలకు దారితీస్తుంది. అలాంటప్పుడు స్వీయ రక్షణ ఉత్తమ మార్గం. ఒకవేళ పక్షులను చూడకుండా ఉండలేని వారు సాధ్యమైనంత వరకు వాటిని ఇంటికి దూరంగా పెంచుకోవడమే మంచిది. ఒకవేళ వాటికి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తే చేతులకు గ్లౌజులు, మూతికి మాస్క్, కళ్ళకు కళ్ళజోడు, తలకు క్యాప్, పాదాలకు షూస్ ధరించాలని” వైద్య నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version