https://oktelugu.com/

Indian 2 : భారతీయుడు 2 కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్య పోతారు… మరి ఇంత తక్కువేంటి స్వామి…

మొదటి రోజు తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో కలిపి కేవలం 28.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ సినిమా అంత తక్కువ కలెక్షన్స్ ని రాబడుతుందని ఎవరు అనుకోలేదు ఎందుకంటే కమలహాసన్ కి అటు విక్రమ్ ఇటు కల్కి లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి మార్కెట్ అయితే ఏర్పడింది.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 10:06 PM IST
    Follow us on

    Indian 2 : కమలహాసన్ లాంటి దిగ్గజ నటుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలు అలాంటివి…ఇక దానికి తోడుగా విక్రమ్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో కమలహాసన్ క్రేజ్ అనేది మరింత పెరిగిపోయింది. అలాగే రీసెంట్ గా కల్కి సినిమాలో కూడా విలన్ గా నటించి కమలహాసన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ ఊపులోనే ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు భారీ రేంజ్ లో ఉంటాయని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ వాటిని తారుమారు చేస్తూ ఈ సినిమా రిలీజ్ రోజున ఏమాత్రం తన ప్రభావాన్ని చూపించలేకపోయింది.

    మొదటి రోజు తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో కలిపి కేవలం 28.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ సినిమా అంత తక్కువ కలెక్షన్స్ ని రాబడుతుందని ఎవరు అనుకోలేదు ఎందుకంటే కమలహాసన్ కి అటు విక్రమ్ ఇటు కల్కి లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు సినిమాలు వచ్చాయి కాబట్టి దాదాపు 50 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ అందులో సగం మాత్రమే వసూలు చేసి ట్రేడ్ పండితులకు సైతం షాక్ ఇచ్చింది. ఈ సినిమాను చేయడానికి దాదాపు 300 కోట్ల వరకు బడ్జెట్ అయితే అయింది. అయినప్పటికీ ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ను చూస్తుంటే ఈ సినిమా భారీగా నష్టపోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఎందుకంటే మొదటి రోజే తక్కువ కలెక్షన్లు వచ్చిన ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల వరకు కూడా వసూళ్లను రాబట్టే అవకాశాలైతే కనిపించడం లేదు. మరి ఇలా అయితే ఈ సినిమా భారీగా నష్టపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఇండియన్ 3 సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించి ఎలాగైనా సరే ఈ సినిమాను సక్సెస్ చేయాలనే ఉద్దేశం లో శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే మాత్రం ప్రొడ్యూసర్స్ కి విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఇందులో జరిగిన నష్టాన్ని అందులో సమకూర్చాలనే సంకల్పంతోనే ఇప్పుడు శంకర్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…

    ఈ వీకెండ్ గడిస్తే ఇక భారతీయుడు సినిమా గురించి పట్టించుకునే నాధుడు కూడా ఉండడు. కాబట్టి సినిమాకి భారీ నష్టాలైతే తప్పే విధంగా కనిపించడం లేదు. ఇక ఇప్పటికైనా శంకర్ కొంచెం కథ మీద ఫోకస్ చేసి సినిమాలను తెరకెక్కిస్తే మంచిది అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే తను కథ మీద ఎలాంటి ఎఫర్ట్ చూపించకుండా విజువల్ పరంగానే ఆ గ్రాండీయర్ ని తీసుకొచ్చి డబ్బులు భారీగా ఖర్చుపెట్టి సినిమాను గట్టెక్కించొవచ్చని శంకర్ చూస్తున్నాడు.

    కానీ సినిమా విజువల్ వండర్ గా ఉన్న అందులో ఒక మంచి కథ ఉంటేనే ప్రేక్షకులు కూడా థియేటర్ కి వస్తారు అనేది వాస్తవం… గత పది సంవత్సరాల నుంచి శంకర్ ఇలాగే కథలు ఏమీ లేకుండా ఓన్లీ విజువల్ గా బాగుండే విధంగా చూసుకుంటున్నాడు అంతే తప్ప కథలో మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు…మరి ఇలా అయితే చాలా కష్టం కాబట్టి భారతీయుడు 3 సినిమాలో అయిన కథ బాగుండే విధంగా చూసుకుంటే మంచిది అని చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…