Heart : గుండె ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఒక్కసారిగా గుండె ఆగిపోతే మాత్రం ఒక ప్రాణాలు పోతాయి. అయితే మన బాడీలో కేవలం ఒక మెదడు మాత్రమే ఉందని చాలా మంది అనుకుంటారు. అందుకే మనస్సు చెప్పిన మాట కంటే మెదడు చెప్పిన మాటే ఎక్కువగా వింటుంటారు. గుండె, మెదడు రెండూ కూడా మన శరీర భాగాల్లో చాలా ముఖ్యమైనవి. అయితే గుండెకు కూడా మెదడు ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే గుండెకు, మెదడుకు చాలా లింక్ ఉంది. గుండెకు మెదడు సంకేతాలను పంపినప్పుడు మాత్రమే గుండె పనిచేయగలదు. లేకపోతే గుండె ఆగిపోతుంది. దీంతో మనిషి ప్రాణాలు కోల్పోతాడు. అయితే చాలా మంది గుండెకు మెదడు ఉండదని అనుకుంటారు. కానీ గుండెలో నాలుగు వేల న్యూరాన్లు ఉంటాయి. ఇవి ఒక సంక్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయి. ఈ నెట్‌వర్క్‌ను మినీ బ్రెయిన్ అంటారు. ఈ మినీ మెదడును న్యూరోసిస్టమ్ అని కూడా అంటారు. ఈ న్యూరాన్లు గుండె మెదడులా పనిచేస్తాయి. ఆ న్యూరాన్లు పనిచేయకపోతే మినీ బ్రెయిన్ ఆగిపోతుంది. ఇక మనిషి చనిపోతాడు. అంటే గుండెలోని మినీ బ్రెయిన్ పనిచేయకపోతే ఆటోమెటిక్‌గా గుండెపోటు వచ్చి మరణం సంభవిస్తుంది. అందుకే గుండెలో ఉండే మినీ బ్రెయిన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి.
ప్రస్తుతం మారిన జీవన శైలి, తీసుకునే ఆహారం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎక్కువగా గుండె ప్రమాదాల బారిన పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండె పోటుతో మరణిస్తున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి చెందాలంటే మాత్రం మంచి ఆహార అలవాట్లు పాటించాలి. ముఖ్యంగా పోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పదార్థాల డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, తాజా కూరగాయలను తీసుకోవాలి. వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్స్, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫైబర్, పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గించి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే లీన్, చేపలు, గుడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటివల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఆరోగ్యమైన కొవ్వులు ఇచ్చే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అనారోగ్య కొవ్వులు ఇచ్చే బర్గర్, మసాలా ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రై వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.