Mirchi : సాధారణంగా చాలా మంది స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. అందుకే ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు. వాటిని చేసేటప్పుడు కూడా కొంచెం స్పైసీగా చేయండి అని చెప్తుంటారు. అయితే ఇంత కాలం తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదయినా లిమిట్ లో మాత్రమే తినాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే చాలా అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటారు. ఫుడ్ టేస్ట్ గా ఉండాలని కొందరు కారంపొడి, కరివేపాకు పొడిలో ఉండేవి తయారు చేసుకొని తింటారు. వీటిలో ఎక్కువగా మసాలాలు అన్నీ ఉంటాయి. వీటిని అతిగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కారం, మసాలాలు అధికంగా తింటే కొన్ని సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. ఈరోజుల్లో చాలా మంది ఇంట్లో వండిన వాటి కంటే బయట ఎక్కువగా తింటున్నారు. బిజీ లైఫ్ లేదా బద్ధకం వల్ల బయట ఫుడ్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిలో అధికంగా కారం మసాలాల వల్ల తొందరగా అనారోగ్యం బారిన పడతారు. కొందరికి కారం అవి ఎక్కువగా తింటే వీరేచనాలు అవుతాయి. అయిన కారం తినడం తగ్గించకుండా ఇంకా అధికంగా తింటుంటారు. మరి అధికంగా తింటే వచ్చే ఆ సమస్యలు ఏంటో చూద్దాం.
కొందరు ఏ ఫుడ్ తిన్న చాలా స్పైసీగా తింటుంటారు. ఇలా స్పైసీ ఉన్న ఫుడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కారం అధికంగా తింటే అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, మైకం, వికారం, బలహీనత, కడుపులో మంట, గొంతులో మంట వంటివి వస్తాయి. అలాగే కడుపులో పుండ్లు కావడం, గ్యాస్ వంటివి కూడా ఏర్పడుతాయి. కాబట్టి రెడ్ మిర్చి ఎక్కువగా తినకూడదు. వీటితో చేసిన కారం పొడి ఎక్కువగా తింటే డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. వీటిని చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. చాలా మంది పచ్చళ్లు, కారం పొడి, వెల్లులి కారం ఇలాంటివి అధికంగా తింటారు. వీటిని తినడం అసలు మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే క్యాన్సర్, కాలేయ, గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటిని తినడం తగ్గించాలి. కొందరికి ఈ కారం వల్ల మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా చికెన్, మటన్ తింటారు. వీటికి కారం, మసాలా ఎక్కువగా లేకపోతే అసలు టేస్ట్ ఉండదు. ఎపుడో ఒకసారి తింటే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ వారానికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఇలాంటివి తినడం మానేయడం బెటర్.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More