Remove Bad cholesterol
Remove Bad cholesterol : చాలామంది బయటకి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు.. కానీ వాళ్లకి చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొంతమంది సన్నగా ఉన్నా.. ఆరోగ్యంగా ఉంటారు. మరి కొందరు మాత్రం లావుగా ఉంటారు. కానీ ఆరోగ్యంగా ఉండరు. వాళ్ల బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే కొందరిలో ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చెడు అలవాట్ల వల్ల చాలామంది ఈ రోజుల్లో ఈ చెడు కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొందరు అదే దీనికోసం ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నారు. కొంతమందికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి బాడీలో ఉండే కొవ్వు కరుగుతుంది. కానీ కొంతమందికి ఈ సమస్య ఎక్కువ అయి చనిపోతున్నారు. కాబట్టి బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాన్ని సహజంగా మనమే కరిగించుకోవాలి. అప్పుడు అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే సహజంగా బాడీలోని చెడు కొలెస్ట్రాన్ని కరిగించుకోవాలంటే.. రోజువారి డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. మరి ఆహార పదార్థాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది ధమనుల్లో పేరుకు పోతుంది. దీనివల్ల గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం తినే ఫుడ్ లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, గోధుమలు, బాదం, పిస్తా, అవిసె గింజలు, బార్లీ, పొద్దుతిరుగుడు గింజలు, ఆపిల్స్, పియర్స్ వంటివి ఎక్కువగా తింటుండాలి. వీటిని రోజు తినడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొంతమంది ఎక్కువ బరువుగా ఉంటారు. దీనివల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి. అలాగే మద్యం ధూమపానం వంటివి తీసుకోకపోవడం మంచిది. అలాగే తినే ఫుడ్ లో పాల ఉత్పత్తిలు ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు ఒమేగా 3 ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, వాల్ నట్స్ ఉండేలా చూసుకోవాలి. బిర్యానీ, బయట ఫాస్ట్ ఫుడ్ వంటివి అసలు తినకూడదు. రోజు ఉదయం వాకింగ్, యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుండాలి. అయితే ఈరోజుల్లో చాలామందికి వెల్లుల్లి తినడం అంతగా నచ్చదు. కానీ దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఖనిజాలు, పోషకాలు బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటుంది. అలాగే గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి కూడా బాడీలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. డైలీ మీ డైట్ లో ఇవన్నీ ఉండేలా చూసుకుంటే.. కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోతుంది. దీంతో అలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
View Author's Full InfoWeb Title: If these food items are included in the diet cholesterol will dissolve in the body