Spirituality : చాలా మందికి దేవుడు అంటే నమ్మకం, భక్తి ఉంటాయి. చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి లేదా కోరిన కోర్కెలు నెరవేరాలని పూజలు చేస్తారు. హిందూ సంప్రదాయంలో ఏడాది అంతా పూజలు ఉంటూనే ఉంటాయి. వినాయక చవితి మొదలు ఉగాది వరకు పూజలు ఉంటూనే ఉంటాయి. అన్ని పూజలను అందరు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. అయితే పూజ చేసే సమయంలో దేవుడిని పూలతో అలంకరిస్తారు. పువ్వులతో నిండుగా అలంకరించడం వల్ల అందంగా ఉంటుంది. అలాగే దేవుడికి ఇష్టమైన పువ్వులతో పూజించడం వల్ల కోరిన కోరికలు తీరుస్తారని చాలామంది నమ్ముతారు. అయితే ఇలా దేవుని అలంకరించేటప్పుడు దేవుడు పటాలకు పువ్వులు పెడుతుంటారు. ఇలా పెట్టేటప్పుడు దేవుడి పటం నుంచి ఒక పువ్వు లేదా ఇంకా ఏదయినా అకస్మాత్తుగా కింద పడితే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. వాళ్లు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని ఫిక్స్ అయిపోతారు. అయితే ఇందులో నిజం లేదని.. ఏదో పువ్వులు ఎక్కువగా అయి కింద పడతాయని కొందరు అంటారు. మరి ఇందులో నిజం ఎంత తెలుసుకుందాం.
సాధారణంగా దేవుడు పటాలకు పెట్టిన పువ్వులు ఒక్కోసారి కింద పడుతుంటాయి. దీంతో చాలా మంది మంచి జరుగుతుందని ఫీల్ అవుతారు. అయితే ఇది నిజమే అని పండితులు చెబుతున్నారు. మనం పెట్టిన పువ్వులు మాత్రమే కాకుండా వేరే పువ్వులు అయినా దేవుడు విగ్రహం లేదా పటం నుంచి కింద పడితే మంచిదే అంటున్నారు. ఇలా పడటం వల్ల మీరు అనుకున్న పనులు తొందరగా అవుతాయి అని పండితులు చెబుతున్నారు. అలాగే మీరు చేసిన పూజ కూడా విజయవంతం అయ్యింది అని అర్ధం. మీరు చేసిన పూజ కి దేవుడు కూడా తృప్తి చెందాడని అర్థం. వీటితో పాటు మీకు జీవితంలో ఆనందం అన్ని లభిస్తాయి. ఇలా పువ్వులు పడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారని అర్థం చేసుకోవాలి. ఈ పువ్వులని వాళ్లతో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు. ఒక ఎరుపు క్లాత్ లో కాయిన్, బియ్యం వేసి గట్టిగా కట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు లైఫ్ లో డబ్బు కొరత ఉండదు. అవసరానికి డబ్బు చేతికి అందుతుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ దేవుడు అనుగ్రహం ఎప్పటికీ మీతోనే ఉంటుంది. చాలా మందికి మనీ సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా పువ్వులు పడటం వల్ల ఏదయినా చెడు జరుగుతుందని భావించవద్దు. దేవుడు మీకు మంచి చేస్తాడు. అలా కింద పడిన పువ్వులని బీరువా వంటి దగ్గర పెడితే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Bhaskar Katiki is the main admin of the website
Read More