Dinner : రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? మీరు చాలా డేంజర్ లో ఉన్నట్టే..

Dinner ఎప్పుడు తింటున్నామనే దాని కన్నా ఏం తింటున్నాయనే దానిపై అధ్యయనాలు చేస్తుంటారు. అయితే భోజన వేళలనూ పరిగణనలోకి తీసుకోవటం కూడా చాలా ముఖ్యం అంటుంది ఈ అధ్యయనం.

Written By: NARESH, Updated On : June 17, 2024 8:35 am

If you eat dinner late, you are in danger

Follow us on

Dinner : చాటింగ్, మీటింగ్, ఫ్రెండ్స్ తో సిట్టింగ్ అయిన తర్వాతనే రాత్రి భోజనం చేస్తారు. కొందరు పని వల్ల కూడా లేట్ గా తింటారు. అయితే రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయకూడదట. ముఖ్యంగా కొవ్వులు, చక్కెర ఉన్న ఆహారాన్ని అసలే తినకూడదట. అయితే పడుకోవటానికి 3 గంటల్లోపు భోజనం చేసేవారిలో పెద్దపేగు చివర క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. రాత్రి భోజనాన్ని త్వరగా తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్టు షికాగోలోని రష్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.

ఇలాంటి వారిలో మూడు కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉందట. నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్‌ రహితమే. ఈ కణితుల్లో కొన్ని క్యాన్సర్‌గా మారే ప్రమాదముంది. జీర్ణకోశంలో ఇవి ఉండేచోటు, సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. అసలు ఈ పెద్దపేగు క్యాన్సర్‌కూ ఆలస్యంగా భోజనం చేయటానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని గ్రహిస్తుందట. శరీర అవయవాలు రెస్ట్ మోడ్ లో ఉంటాయట.

మరీ ముఖ్యంగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటారు. ఇది పేగుల్లోని జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అంతేకాదు బరువు పెరగటానికీ కారణం అవుతుంది. దీని వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాకు తమవైన జీవగడియారాలుంటాయి అంటున్నారు నిపుణులు. ఇవి రోజువారీ లయను అనుసరిస్తుంటాయి. తినే ఆహారాన్ని బట్టి కొన్నిరకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరిస్తుంటాయట. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తింటే వీటిమీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎప్పుడు తింటున్నామనే దాని కన్నా ఏం తింటున్నాయనే దానిపై అధ్యయనాలు చేస్తుంటారు. అయితే భోజన వేళలనూ పరిగణనలోకి తీసుకోవటం కూడా చాలా ముఖ్యం అంటుంది ఈ అధ్యయనం.

ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన, సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మేరకు మాత్రమే అందించడం జరుగుతుంది. దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.