Rushikonda: శత్రు దుర్భేద్యంలో సామాన్యులకు ప్రవేశం!

సాగర తీరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రుషికొండ విరాజిల్లేది. పర్యాటక చరిత్ర పటంలో రుషికొండది ప్రత్యేక స్థానం. కానీ ఆ కొండను తొలిచి.. వైసిపి ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది.

Written By: Dharma, Updated On : June 17, 2024 8:33 am

Rushikonda

Follow us on

Rushikonda: విశాఖకు ల్యాండ్ మార్క్ రుషికొండ. నగరానికి వచ్చేవారు తప్పకుండా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. మెలికలు తిరిగే రోడ్లు, పర్యాటక భవనాలు రుషికొండ సొంతం. కానీ గత ఐదు సంవత్సరాలుగా రుషికొండ ప్రాంతంలో సందర్శనలు నిలిచిపోయాయి.సామాన్యుడు నుంచి ఉన్నత వర్గాల వరకు ఎవరికీ అక్కడ సందర్శించేందుకు అనుమతి లేదు. అత్యంత భద్రత వలయంతో నిర్మాణాలు చేపట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రు దుర్భేద్యంగా దీనిని తీర్చిదిద్దారు.నిర్మాణాలు కొనసాగిన సమయంలో మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. విపక్ష నేతలు సందర్శించినప్పుడు పోలీసులతో ఉక్కు పాదం మోపారు. కానీ రోజులు ఒకేలా ఉండవు. అధికారం తారుమారు అవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. పవర్ పోవడంతో సామాన్యుడు రుషికొండ భవనాల్లో అడుగు పెట్టగలిగాడు.

సాగర తీరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రుషికొండ విరాజిల్లేది. పర్యాటక చరిత్ర పటంలో రుషికొండది ప్రత్యేక స్థానం. కానీ ఆ కొండను తొలిచి.. వైసిపి ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. పర్యావరణాన్ని చిత్రం చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెట్టినా.. పర్యావరణ ప్రేమికులు నెత్తి నోరు బాదుకున్నా వినకుండా జగన్ సర్కార్ ముందుకు పోయింది. అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. ‘చెట్టు పోతే పెంచగలం.. కొండ కొట్టేస్తే పెంచడం సాధ్యమేనా’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయినా జగన్ మారలేదు. దాదాపు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టారు. విలాసవంతమైన భవనాలు నిర్మించారు. అదేమంటే ప్రభుత్వ అవసరాల కోసమని అప్పట్లో వైసీపీ పెద్దలు తీర్పు చెప్పారు.

పచ్చదనానికి మచ్చుతునకగా నిలిచి రుషికొండను తొలిచారు. న్యాయస్థానాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కృత్రిమ పచ్చని తివాచీని పరిచారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కాకిని కూడా అక్కడ వాలనివ్వలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిడిపి అధికారంలోకి వచ్చింది. రుషికొండపై ఆంక్షలు ఎత్తివేసింది. ఒకప్పుడు డిసిపి స్థాయి అధికారిని, పదిమంది సీఐలను అక్కడ నిర్మించేవారు. ఈగ వాలితే కేసుపెట్టేవారు. సిపిఐ నారాయణ వంటి వారు కూడా దిక్కుతోచక వెనుదిరిగారంటే ఏ స్థాయిలో అక్కడ భద్రత వలయం సృష్టించేవారో ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు సామాన్యుడు సైతం రుషికొండలో అడుగుపెట్టడం అభినందనీయం.