https://oktelugu.com/

Forbes Richest List 2024: అంబానీ అండర్‌ 10.. అదాని అండర్‌ 20!

ఫోర్బ్స్‌ గతేడాది విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ఈ ఏడాది సంపన్నుల జాబితాలో 141 మంది పెరిగారు. వీరి మొత్తం సంపద 2023తో పోలిస్తే 2 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 4, 2024 / 01:03 PM IST

    Forbes Richest List 2024

    Follow us on

    Forbes Richest List 2024: ప్రపంచ కుబేరుల జాబితాలో భారత దేశానికి చెందిన ఇద్దరు సంపన్నులకు టాప్‌ 20లో స్థానం దక్కింది. భారత అత్యంత ధనవంతుడిగా నిలిచిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో 9వ స్థానంలో నిలవగా, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ 17వ స్థాథనంలో నిలాడు.

    జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్‌..
    ప్రపంచంలో బిలియనీర్లు జాబితాతో ఫోర్బ్స్‌ సంస్థ 2024 సంవత్సరం జాబితాను విడుదల చేసింది.ఇందులో 116 బిలియన్‌ డార్ల›్ల నికర సంపదతో ముఖేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచాడు. 2023లో ఆయన సంపద 83.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌తో రెండో సంపన్నుడైన గౌతమ్‌ అదానీ కూడా ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు ఇతను 17వ స్థానంలో నిలిచాడు. ఆయన సంపద 47.2 బిలియన్‌ డాలర్ల నుంచి 84 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అమెరికాషార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక తర్వాత గతేడాది అదానీ సంపద 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసింది.

    పెరిగిన సంపన్నులు..
    ఫోర్బ్స్‌ గతేడాది విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ఈ ఏడాది సంపన్నుల జాబితాలో 141 మంది పెరిగారు. వీరి మొత్తం సంపద 2023తో పోలిస్తే 2 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. 2024లో 14.2 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. జాబితాలో మూడింట రెండు వంతుల మంది సంపద వృద్ధి చెందగా, నాలుగింట ఒకవంతు మంది సంపన్నుల ఆస్తి తగ్గింది.

    అగ్రస్థానంలో బెర్నార్డ్‌ అర్నాల్ట్‌..
    ఇక తాజాగా 2024 జాబితాలో ఫ్రాన్స్‌ విలాస వస్తువుల దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 233 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచాడు. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌(194 బిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానంలో ఉన్నారు. ఫేప్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌(177 బిలియన్‌ డాలర్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

    జాబితాలో 813 అమెరికన్లు..
    ఫోర్బ్స్‌–2024 జాబితాలో అమెరికా నుంచి 813 మందికి స్థానం దక్కించుకున్నారు. చైనా నుంచి 473 మంది జాబితాలో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 31 మంది పెరిగి 200లకు చేరింది.

    భారతీయులు వీరే..
    ఇక జాబితలో ఉన్న భారతీయులు చూస్తే హెచ్‌సీఎల్‌ టెక్‌ సహ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌ 36.9 బిలియన్‌ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్‌గ్రూప్‌ నుంచి సావిత్రి జిందాల్‌ (33.5 బిలియన్‌ డాలర్లు) 46వ స్థానంలో ఉన్నారు. ఇక సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వీ (26.7 బిలియన్‌ డాలర్లతోఎ) 69వ స్థానంలో నిలిచారు. సైరస్‌ పునావాలా(21జ3 బిలియన్‌ డాలర్లు) 90వ స్థానంలో, కుషాల్‌ పాల్‌ సింగ్‌(20.9 బిలియన్‌డాలర్లు) 92వ స్థానంలో ఉండగా, కుమార్‌ బిర్లా(19.7 బిలియన్‌ డాలరు) 98వ స్థానం దక్కించుకున్నారు.