
మాంసాహార ప్రియులు చికెన్ ను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. సాధారణంగా ఇతర ప్రాంతాలతో ప్రజలతో పోలిస్తే హైదరాబాద్ వాసులు గత కొన్ని నెలలుగా చికెన్ ను ఎక్కువగా తింటున్నారు. అయితే దేశంలోని నగరాల్లో చికెన్ వినియోగం గురించి చేసిన అధ్యయనంలో హైదరాబాద్ లో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్ముడవువున్నట్టు తేలింది. దేశంలో మరే నగరంలో ఈ స్థాయిలో చికెన్ అమ్మకాలు జరగడం లేదు.
Also Read: బీపీతో బాధ పడేవారికి గుడ్ న్యూస్.. ఆ మందులతో దీర్ఘాయువు..?
నగరంలో రోజుకు లక్షన్నర కిలోల మటన్ అమ్ముడవుతుంటే మటన్ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. గత రెండు నెలల్లో వినియోగాన్ని బట్టి హైదరాబాద్ నంబర్ 1 స్థానంలో నిలిచింది. హైదరాబాద్ కు ఈ అరుదైన రికార్డు దక్కడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బిర్యానీ వల్లే హైదరాబాద్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ తొలి స్థానంలో ఉంటే డిల్లీ చికెన్ అమ్మకాల్లో రెండో స్థానంలో ఉంది.
Also Read: చలికాలంలో మద్యం తాగే వారికి షాకింగ్ న్యూస్..?
మూడో స్థానంలో ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగళూరు నగరం ఉంది. చికెన్ ధర తక్కువగా ఉండటం, మటన్ ధర ఎక్కువగా ఉండటం వల్ల మాంసాహార ప్రియులు చికెన్ ను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నగరంలో ప్రస్తుతం కిలో చికెన్ 140 రూపాయల నుంచి 200 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీల్లో సైతం చికెన్ బిర్యానీనే ఎక్కువగా సేల్ అవుతూ ఉండటం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం ఆరోగ్యం/జీవనం
స్విగ్గీ, జొమాటోలు ఈ ఏడాది ఎక్కువగా బియానీనే తమ యాప్ ల ద్వారా డెలివరీ అయినట్టు చెబుతున్నాయి. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న గుర్తింపు వల్ల ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వాళ్లు సైతం బిర్యానీని ఆర్డర్ చేయడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.