https://oktelugu.com/

రైతులకు ‘టైం’ ఫిక్స్ చేసిన కేంద్రం..!

కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలు అమలు చేస్తే తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీలో నెలరోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే కేంద్రం ఇప్పటికే రైతులతో పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం కన్పించడం లేదు. ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 07:30 PM IST
    Follow us on

    కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలు అమలు చేస్తే తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీలో నెలరోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే కేంద్రం ఇప్పటికే రైతులతో పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం కన్పించడం లేదు.

    ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు నెలరోజులుగా దీక్షలు చేస్తుండటంతో దేశవ్యాప్తంగా వారికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. రైతుల దీక్షలు విరమించేలా చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

    ఈక్రమంలోనే కేంద్రం సైతం మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. రైతులు సైతం కేంద్రంతో చర్చించేందుకు సిద్ధమేనని ప్రకటించడంతో కేంద్రం తాజాగా టైంను ఫిక్స్ చేసింది.

    డిసెంబర్ 29న చర్చలు జరుపాలని రైతులు కోరగా.. కేంద్రం మాత్రం డిసెంబర్ 30 మధ్యాహ్నం 2గంటలకు టైం ఫిక్స్ చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ కు రైతు సంఘాల నేతలు ఆ సమయానికి రావాలని కేంద్రం కోరింది.

    ఈ చర్చల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. ఈసారైనా కేంద్రం.. రైతుల మధ్య చర్చలు సఫలం అవుతాయో లేదో వేచిచూడాల్సిందే..!