https://oktelugu.com/

Dandruff : చుండ్రుకు సులభంగా చెక్ పెట్టే బిర్యానీ ఆకు.. ఎలాగంటే?

ప్రతి ఒక్కరి వంటింటిలో లభ్యమయ్యే ఆకు బిర్యానీ ఆకు. దీనితో సులభంగా చుండ్రు సమస్యను తగ్గించవచ్చట. బిర్యానీ ఆకుతో కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం, అందం కూడా పెంచుకోవచ్చు. అదెలా అంటే? ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మరి బిర్యానీ ఆకుతో చుండ్రు సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు

Written By:
  • Bhaskar
  • , Updated On : August 20, 2024 / 11:38 PM IST

    Dandruff

    Follow us on

    Dandruff : శిరోజాల సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో ఎక్కువగా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా.. చిట్లడం, రాలడం, ఊడిపోవడం వంటివి నిత్యం వెంటాడుతున్న సమస్యలు. ఇక చుండ్రు సమస్య కూడా చాలా మందిని వెంటాడుతుంది.. ఈ చుండ్రు కారణంగా జుట్టు బలహీన పడుతుంది. తద్వారా ఎక్కువగా రాలిపోతుంది జుట్టు. చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల చిట్కాలు ప్రయత్నించి ఉంటారు. మీకు తెలిసిన షాంపూలు, నూనెలు, వంటింటి చిట్కాలు ఉపయోగించారు కావచ్చు కదా. వీటి వల్ల కొందరికి ప్రయోజనం ఉంటే మరికొందరికి వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మీ కోసం ఓ బెస్ట్ టిప్ ను ఇప్పుడు చెప్పబోతున్నాం. అదేంటంటే?

    ప్రతి ఒక్కరి వంటింటిలో లభ్యమయ్యే ఆకు బిర్యానీ ఆకు. దీనితో సులభంగా చుండ్రు సమస్యను తగ్గించవచ్చట. బిర్యానీ ఆకుతో కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం, అందం కూడా పెంచుకోవచ్చు. అదెలా అంటే? ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మరి బిర్యానీ ఆకుతో చుండ్రు సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు అయితే చదివేసేయండి.

    హెయిర్ మాస్క్:
    దీని వల్ల తలపై ఉండే వాపు, దురద, దద్దుర్లు, పొడి బారడం, బ్యాక్టీరియా వంటి సమస్యలను నయం చేయవచ్చు. ముందుగా ఓ ఐదు లేదా ఆరు బిర్యానీ ఆకులను తీసుకుని అందులో కొద్దిగా నీటిని వేసి ఉడకబెట్టుకోవాలి. ఆకులు బాగా ఉడికా.. స్టవ్ ఆఫ్ చేసి.. చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వేప ఆయిల్ ఉంటే వేసి కలపండి. ఆ తర్వాత అందులో అలోవెరా జెల్, ఉసిరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.. ఓ ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. పావు గంట సేపు అలానే ఉంచి.. ఆ తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.

    బిర్యానీ ఆకుల రసం:
    బిర్యానీ ఆకుల రసం కూడా చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. నాలుగు లేదా 5 బిర్యానీ ఆకుల్ని నీటిలో మరిగించుకోవాలి. చల్లారాక కొద్దిగా కొబ్బరి నూనె రాసి.. తలకు పట్టించడం వల్ల ఇన్ ఫెక్షన్లు, మొటిమలు, డ్రైనెస్ వంటి సమస్యయలకు చెక్ పెట్టవచ్చు. చుండ్రు తగ్గి.. జుట్టు మూలాలు కూడా బలంగా మారుతాయి. ఈ ఆకుల రసాన్ని అప్పుడప్పుడు జుట్టుకు పట్టిస్తే హెయిర్ కండిషనర్‌గా కూడ పని చేస్తుంది.

    శరీరానికి కూడా ప్రయోజనమే..
    ఈ ఆకులు కేవలం శిరోజాల సమస్యలను మాత్రమే కాదు. శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ ఏ, సీ, బీ6 లు ఉంటాయి. ఐరన్‌, పొటాషియం, మాంగనీసు, డైటరీ ఫైబర్లు, ఫోలిక్‌ యాసిడ్‌ లను కలిగి ఉంటాయి బిర్యానీ ఆకులు. అందుకే వీటిని ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు నాడీ వ్యవస్థ పని తీరు బాగుంటుంది. దీంతో మెదడు మరింత పని చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు, నొప్పులు మాయం అవుతాయి. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.