https://oktelugu.com/

Below one year child : సంవత్సరం లోపు పిల్లలకు వీటిని తినిపిస్తున్నారా? అయితే మీ పిల్లలు డేంజర్ లో ఉన్నట్టే..

పిల్లలకు ఎలాంటి ఆహార పదార్థాను ఇవ్వాలి? ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి అనే విషయాల పట్ల కచ్చితంగా అవగాహన ఉండాలి. కొన్ని ఆహారాలు శరీరానికి మేలు చేసినా.. సంవత్సరంలోపు పిల్లలకు మంచివి కావు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆవు పాలు పిల్లలకు చాలా మంచివి. కానీ సంవత్సరం లోపు పిల్లలకు ఈ ఆవుపాలను ఇవ్వకూడదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 20, 2024 / 10:40 PM IST

    Below one year child

    Follow us on

    Below one year child : పిల్లలు పుట్టడం అంటే అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం పిల్లలు పుట్టడం చాలా కష్టంగా మారింది. పుట్టిన తర్వాత కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే వీరి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు మీరు ఇచ్చే ఆహారం వల్లనే వారి శరీరం ఎదుగుతుంది. అయితే కొందరు పిల్లలు తింటున్నారు అని ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలను తినిపిస్తుంటారు. అయితే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆరు నెలల పిల్లల వరకు వారికి ఎలాంటి ఆహారాలు ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ పాల వల్ల శిశువు శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఆ తర్వాత 6 నెలలకు తేలికపాటి ఆహారం ఇవ్వడం ప్రారంభించాలి. ఈ దశ ప్రారంభంలో సెమీ లిక్విడ్ ఫుడ్ ఇచ్చినా సరే వారు మాత్రం ఆహారాలు కొరడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ సమయంలో కనీసం 1 నుంచి ఒకటిన్నర సంవత్సరాల వరకు పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు నిపుణులు. లేదంటే కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యలు వస్తుంటాయట.

    అందుకే పిల్లలకు ఎలాంటి ఆహార పదార్థాను ఇవ్వాలి? ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి అనే విషయాల పట్ల కచ్చితంగా అవగాహన ఉండాలి. కొన్ని ఆహారాలు శరీరానికి మేలు చేసినా.. సంవత్సరంలోపు పిల్లలకు మంచివి కావు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆవు పాలు పిల్లలకు చాలా మంచివి. కానీ సంవత్సరం లోపు పిల్లలకు ఈ ఆవుపాలను ఇవ్వకూడదు. ఎందుకంటే శరీర పోషణకు అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.. కాబట్టి ఆవు పాలను పిల్లలు జీర్ణించుకోలేరు. ఫలితంగా పిల్లలకు కడుపు ఉబ్బడం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధ పడతారు.

    తేనె:
    సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు చాలా మంది తేనె కూడా ఇస్తుంటారు. కానీ నవజాత శిశువులకు తేనె ఇవ్వడం వల్ల ప్రయోజనాలు కాదు కదా నష్టమే అంటున్నారు నిపుణులు. పిల్లలకు బలహీనమైన ప్రేగులు ఉంటాయి. కాబట్టి తేనె కూడా వారికి జీర్ణం అవదు. పిల్లలకు తేనె తినిపిస్తే క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా పిల్లలకు బోటులిజం వస్తుంది అంటున్నారు నిపుణులు. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. మలబద్ధకం సమస్యలు వస్తాయట.

    విటమిన్ సి పండ్లు..
    విటమిన్ సి పుష్కలంగా ఉండే పుల్లని పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. కానీ పుల్లటి పండులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ లు పిల్లలకు కడుపు నొప్పి సమస్యలను తెచ్చి పెడతాయి. అంతేకాదు కొన్ని సార్లు విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

    చాక్లెట్లు:
    చిన్న పిల్లలకు చాక్లెట్ లను అసలు ఇవ్వద్దు. దీని వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. ఇందులోని కెఫిన్, చక్కెర కూడా పిల్లలకు హానికరమే అంటున్నారు నిపుణులు. గోధుమలలో గ్లూటెన్ అనే అలెర్జీ కారకం ఉంటుందట. సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు చాక్లెట్లు జీర్ణం అవ్వవు. బదులుగా, ఈ సమయంలో వారికి అన్నం ఇవ్వడం బెటర్.