https://oktelugu.com/

Tadpole water : టాడ్‌పోల్ వాటర్ తాగేయండి.. బరువు తగ్గేయండిలా!

. ఇవి ఎక్కువగా షుగర్ పేషేంట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చియా గింజల్లో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయాన్నే వీటిని ఏదో విధంగా తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2024 / 12:32 AM IST

    Drink Tadpole water

    Follow us on

    Tadpole water : బరువు తగ్గాలని చాలామంది జిమ్‌కి వెళ్లడం, మందులు వాడటం వంటివి చేస్తుంటారు. అలాగే వీటితో పాటు సహజ చిట్కాలు పాటిస్తుంటారు. ఒక్కసారి బరువు పెరిగితే తగ్గడం అనేది చాలా కష్టం. దీనికోసం ఎన్నో చిట్కాలను పాటిస్తారు. కొందరైతే మందులు కూడా వాడుతుంటారు. కానీ ఫలితం ఉండదు. అయితే మందులు వాడటం వల్ల కొన్ని రోజులకి బరువు తగ్గవచ్చు. కానీ అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇంకా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. అయితే ఎప్పుడైనా ఆరోగ్యంగా బరువు తగ్గాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పే చిట్కా పాటించండి. దీంతో మీరు ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

    కొందరు బరువు తగ్గడానికి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగుతారు. ఇది ఆరోగ్యానికి బలాన్ని ఇవ్వడంతో పాటు తొందరగా బరువు తగ్గేలా సాయపడుతుంది. అయితే చియా సీడ్స్‌తో సులభంగా బరువు తగ్గవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో తొందరగా జీర్ణం కాదు. అలాగే ఆకలి వేయదు. ఈ చియా సీడ్స్‌ను కూడా గోరువెచ్చని నీటిలో వేయాలి. ఇవి కాస్త ఉబ్బిన తర్వాత నిమ్మరసం కలిపి తాగాలి. దీనినే టాడ్‌పోల్ వాటర్ అంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వాటర్ తెగ వైరల్ అవుతోంది. చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు బాడీలో ఉండే అధిక కొవ్వు కరిగేలా చేయడంలో సాయం చేస్తుంది. అలాగే నిమ్మలోని విటమిన సి కూడా అధిక కొవ్వును కరిగిస్తుంది.

    చియా సీడ్స్ వల్ల ఆకలి వేయదు. అలాగే వేరే చిరు తిళ్లు తినాలనే ఆలోచన కూడా రానివ్వదు. వీటిని ఏదో రకంగా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే చియా సీడ్స్‌ను అధిక మోతాదులో తీసుకోకూడదు. లిమిట్‌గా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులోని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొందరిలో గ్యాస్, లో బీపీ వంటివి వస్తాయి. కాబట్టి చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. చాలామంది వీటిని నీటిలో కలిపి తాగకుండా ఓట్స్‌లో కలిపి కూడా తింటున్నారు. ఇలా తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇవి ఎక్కువగా షుగర్ పేషేంట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చియా గింజల్లో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయాన్నే వీటిని ఏదో విధంగా తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.