India Vs England 5th Test
India Vs England 5th Test: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా 3-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ట్రోఫీ దక్కించుకుంది. ఫలితంగా టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్ లో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. ఈ తరుణంలో చివరిదైన ఐదో టెస్టు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరగనుంది. భారత్ కోణంలో చూస్తే ఇది భారత్ కోణంలో చూస్తే ఇది నామమాత్రమైన టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్ పరంగా ఈ మ్యాచ్ లో గెలిస్తే కనీసం పరువు దక్కించుకోవచ్చనేది ఆ జట్టు ఆలోచన. అయితే ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్ ద్వారా భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్ట్ ఆడబోతున్నాడు. అటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెయిర్ స్టో కూడా వందో టెస్ట్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి ఆట తీరుపై ప్రత్యేక కథనం.
అశ్విన్
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ మెరుగైన ప్రతిభ చూపించాడు. నాలుగు టెస్టుల్లో ఏకంగా 17 వికెట్లు తీశాడు. రాజ్ కోట్ లో కీలక బ్యాటింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు మైలురాయి అందుకున్నాడు. తన మాతృమూర్తికి ఆరోగ్యం బాగాలేక పోయినప్పటికీ అనుమతి తీసుకుని చెన్నై వెళ్లాడు. ఒకరోజు ఆమెతో ఉండి తర్వాత ఇన్నింగ్స్ లో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అశ్విన్ ఆటకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.. ఇక రాంచి టెస్టులోనూ అశ్విన్ ఐదు వికెట్లు సాధించాడు. ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్లో 100వ టెస్ట్ ఆడబోతున్న 14వ భారత అశ్విన్ నిలవబోతున్నాడు. అంతేకాదు 100 టెస్టులు ఆడిన తొలి తమిళ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పబోతున్నాడు. 2011లో భారత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. 13 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్ లో టీమిండియా కు ఎన్నో విజయాలు అందించాడు.
బెయిర్ స్టో
ఇంగ్లాండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ ఆటగాడు.. 2012 లో తొలి టెస్ట్ ఆడాడు. ఇతర దేశాల పైన మంచి ప్రతిభ చూపించినప్పటికీ.. ప్రస్తుతం టీమిండియా పై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. గత నాలుగు టెస్టుల్లో తన స్థాయికి తగ్గట్టుగా ఆటను ప్రదర్శించలేదు. ఇప్పటివరకు ఈ టెస్ట్ సిరీస్ లో అతడి అత్యధిక స్కోరు 38 పరుగులంటే అతడి ఆడతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతకాలంగా ఫామ్ లేమి తో బాధపడుతున్న అతడు.. ధర్మశాల వేదికగా భారత జట్టుతో జరిగే మ్యాచ్ ద్వారా 100వ టెస్టు ఆడబోతున్నాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు ధర్మశాల మ్యాచ్ అత్యంత కీలకం. పైగా కెప్టెన్ బెయిర్ స్టో ప్రతిభ చూపుతాడని.. ధర్మశాల వేదికపై ఇంగ్లాండ్ జట్టును గెలిపిస్తాడని కోచ్ మెక్కులమ్ అభిప్రాయపడుతున్నాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ధర్మశాల మ్యాచ్ కీలకం కానుంది. కేవలం అశ్విన్, బెయిర్ స్టో మాత్రమే కాకుండా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు సౌతి, విలియమ్స్ కూడా 100 టెస్టుల మైలురాయిని అందుకోబోతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే రెండవ టెస్టులో వారు ఈ ఘనత సాధించనున్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకేసారి నలుగురు ఆటగాళ్లు 100 టెస్టుల ఘనతను అందుకోవడం ఇదే ప్రథమం.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: In the milestone 100th test ashwin and bairstow registered a rare record together
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com