Hot Water : మానవ శరీరంలో 60 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది తగ్గిన ప్రతిసారి దాహం వేస్తుంది. అయితే కొందరు దాహం వేసినా నీరు తీసుకోవడానికి ఇష్టపడరు. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇటీవల జీర్ణక్రియ సక్రమంగా ఉండడానికి, బరువు తగ్గడానికి ఉదయమే వేడి నీరు తాగాలని చాలా మంది చెబుతున్నారు. పరగడుపున నీరు తాగడం వల్ల రాత్రంతా పేరుకుపోయిన ఆహారం త్వరగా జీర్ణమయి కడుపు శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉండాలని కొందరు వేడినీరు నిత్యం తీసుకుంటున్నారు. ఇలా ఎక్కువ సార్లు వేడి నీరు తీసుకుంటే లాభం కంటే నష్టాలే ఎక్కువ అని తెలుస్తోంది. ఎలాగంటే?
కరోనా తరువాత వేడినీళ్లకు ప్రాధాన్యత పెరిగింది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మలీన పదార్థాలు అన్నీ తొలగిపోతాయి. అయితే కొందరు ఆరోగ్యంగా ఉండాలని రోజంతా వేడి నీరు తీసుకుంటున్నారు. ప్రతీసారి వేడి నీరు తాగడం అంత మంచిది కాదని అంటున్నారు. ఎందుకంటే సాధారణ నీటి కంటే వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. ప్రతీసారి వేడి నీరు తాగడం వల్ల అన్నవాహిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పదే పదే వేడి నీరు తాగడం వల్ల పేగుల్లో సమస్యలు వస్తాయి.
వేడినీరు ఎంత తాగినా తృప్తి అనిపించదు. అలాగే భోజనం చేసేటప్పుడు వేడి నీరు తాగితే దాహం తీరదు. అందువల్ల నార్మల్ వాటర్ తీసుకోవాలి. వేడి నీరు ఎక్కువగా తాగడం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. దీని ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి అని అంటారు. కానీ ఎక్కువగా చెమట రావడం వల్ల నీరసం గా మారుతారు. దీంతో డీ హైడ్రేషన్ కు గురై ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేడి నీరు ఎక్కువగా తాగితే గొంతు ఎండిపోతుంది. పెదాలు ఎండిపోయినట్లు అవుతాయి. దీంతో పదే పదే నీరు తాగాలని అనిపిస్తుంది.
వేడి నీటి వల్ల దంతాలు క్షీణిస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ అనే పొర దెబ్బతింటుంది. దీంతో పళ్లు తొందరగా పాడవుతాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు నార్మల్ వాటర్ తీసుకోవడం మంచిది. ఉదయం పరగడుపున వేడి నీరు తీసుకోవచ్చు. కానీ రోజంతా వేడి నీరు తాగడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వేడి చేసిన నీరు చల్లార్చిన తరువాత తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది.