https://oktelugu.com/

Vastu Tips: శివుని విగ్రహం ఇంట్లో పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

ధ్యాన భంగిమలో ఉన్న శివుని విగ్రహం.. ఇంట్లో శివుని విగ్రహం పెట్టుకోవాలంటే.. కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. శివుని విగ్రహం ధ్యాన భంగిమలో ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు.

Written By: , Updated On : January 30, 2024 / 03:53 PM IST
Vastu Tips
Follow us on

Vastu Tips: భోలేనాథ్, శివయ్య, మహాశివుడు, మహాదేవ్.. దయగల తండ్రి. చిన్న పూజ చేసినా కూడా పరవసించిపోతాడు. ఎంతో సంతోషిస్తాడు ఆ పరమేశ్వరుడు. చెంబెడు నీళ్లు పోసి శివ శివా అంటే చాలు. భక్తితో పూజిస్తే వారి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. అయితే ఇంట్లో శివుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలోచిస్తున్నట్లైతే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా శివుని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి ఈ తప్పులు చేస్తే ఆ మహాదేవుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మరి ఎలాంటి విగ్రహాలు ఉండాలి? ఏవి ఉండకూడదు అనే విషయాలు తెలుసుకుందాం..

ధ్యాన భంగిమలో ఉన్న శివుని విగ్రహం.. ఇంట్లో శివుని విగ్రహం పెట్టుకోవాలంటే.. కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. శివుని విగ్రహం ధ్యాన భంగిమలో ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి శివుని విగ్రహాన్ని పిల్లలు చదువుకునే గదిలో ఉంచవచ్చు. దీని వల్ల పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు వారు చదువులో మెరుగ్గా రాణిస్తుంటారు కూడా.

శివ కుటుంబం చిత్రాన్ని ఉంచండి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో శివుడి కుటుంబాన్ని ఉంచడం చాలా మంచిది అంటారు. దీంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఎన్నో లాభాలు కలుగుతాయట. కుటుంబంలో ప్రేమ, అవగాహన పెరుగుతుంది. అంతేకాదు పరమశివుడు కూడా సంతోషించి తన భక్తులపై ఆశీస్సులను అందిస్తాడు.

పొరపాటున కూడా ఈ విగ్రహాన్ని పెట్టవద్దు..
కొన్ని దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టవద్దు అంటారు పండితులు. కొన్ని విగ్రహాల వలన జీవితంపై ప్రభావం చూపిస్తాయట. వాస్తు ప్రకారం, మహాదేవుడు తాండవం చేస్తున్నప్పుడు కోపంగా ఉన్న భంగిమలో ఉన్న పటం, బొమ్మ, విగ్రహం ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఉద్రిక్త వాతావారణం ఏర్పడుతుందట.