వర్షాకాలంలో, శీతాకాలంలో చాలామంది దోమల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు అనేక వ్యాధుల బారిన పడటానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా దోమల సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఇంట్లో బంతిపూల మొక్కలను పెంచితే దోమలను సులభంగా తరిమికొట్టవచ్చు. ఆ మొక్కల సువాసన దోమలను సులభంగా తరిమిగొట్టగలదు.
Also Read: ఇంగువ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
సహజంగా దోమలకు చెక్ పెట్టడంలో వేపనూనె సహాయపడుతుంది. సమపాళ్లలో వేపనూనె, కొబ్బరి నూనె తీసుకుని శరీరానికి రాసుకుంటే 8 గంటల పాటు దోమలు కుట్టే అవకాశం ఉండదు. ప్రముఖ జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్ ఈ విషయాలను ప్రచురించింది. వేప నూనె శరీరానికి రాసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. వేపనూనెలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు దోమలు కుట్టుకుండా చేస్తాయి.
Also Read: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
నిల్వ ఉన్న నీటిలో వేపనూనెను వేసినా సులువుగా దోమల వృద్ధిని అరికట్టడం సాధ్యమవుతుంది. నీటిలో వెల్లుల్లి రసం కొద్దిగా వేసి శరీరానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉంటే దోమలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. దోమలు నీరు నిల్వ ఉండే మురికి కాలువల్లో గుడ్లు పెడతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
నిమ్మగడ్డి కాండం, వేపనూనె తీసిన రసంతో దీపాలను వెలిగించినా మంచి ఫలితం ఉంటుంది. తులసి మొక్కలను కిటికీ దగ్గర ఉంచినా లేదా దీపాలను లావెండర్ నూనెతో వెలిగించినా కూడా దోమల సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.